Illu Illalu Pillalu Narmada : బుల్లితెరపై ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ లో ఎంతోమంది అమ్మాయిలు నటిస్తూ హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళకున్న పాపులారిటీని చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. సీరియల్ యాక్టర్లకు ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ఉండడం మామూలు విషయం కాదు.. అయితే ఈ మధ్య సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్ విషయానికి వస్తే స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి ప్రేమలుంటాయి.. తండ్రి మాటలకు కొడుకులు జవదాటకుండా ఉండటం గురించి ఈ సీరియల్ లో చాలా చక్కగా చూపించారు. సీరియల్ మొదలయ్యి కొద్దిరోజులే అయినప్పటికీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.. ఈ సీరియల్ ఈ సీరియల్ లో నటించిన నటి అన్షు రెడ్డి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈ సీరియల్ ఈమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఈమె రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం..
ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మద రెమ్యూనరేషన్..?
ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి.. ఈ సీరియల్‌లో రామరాజు రెండో కోడలిగా కనిపించే నర్మద.. భలే క్యూట్‌గా ఉంటుంది. అబ్బా పెళ్లం అంటే ఇలా ఉండాలబ్బా అని అనేట్టుగానే అనిపిస్తుంది. ఇక ఏ అత్త అయినా కూడా నా కోడలంటే ఇలా ఉండాలి అని కోరుకునేట్టుగానే ఉంటుంది నర్మద క్యారెక్టర్. చదువుకున్న గడుసరి కోడలి పాత్రలో అద్భుతంగా నటిస్తున్న ఈమె అసలు పేరు అన్షురెడ్డి.. ఇప్పటివరకు ఈమె పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సీరియల్ తో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సీరియల్కు ఆమె తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఒక్క రోజుకు దాదాపు 30 వేల వరకు వసూలు చేస్తుందని సమాచారం. నెలలో 20 రోజులు సీరియల్ షూటింగ్ ఉంటే ఆమె సంపాదన లక్షల్లో ఉందన్న మాటే..
Also Read:వంటలక్కకు కూతురు ఉందా..? ఫ్యామిలీ మొత్తం అదే పనా..?
అన్షు పర్సనల్ లైఫ్..
తెలుగు బుల్లితెరపై అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి అన్షురెడ్డి.. ఆమె ‘భార్యామణి’ సీరియల్ తో బుల్లితెర కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఫస్ట్ సీరియల్ తోనే తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కిచుకుంది. ‘గోకులంలో సీత’, ‘ఇద్దరమ్మాయిల తో’, ‘సూర్యవంశం’, ‘కథ లో రాజకుమారి’ లాంటి సీరియల్స్ లో బాగా పాపులర్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ సీరియల్స్ లోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో అన్షు బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది..