Varsha Bollamma: టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుర్ర హీరోలతో కలిసి నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదగడం కోసం చాలా కష్టపడుతుంది. ఇక ఈ మధ్యనే కానిస్టేబుల్ కనకం సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులను కూడా తనవైపు తిప్పుకుంది. ఈటీవీ విన్ లో ఈ సిరీస్ విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మధ్య నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో కూడా వర్ష నటించింది. అయితే ఈ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.
ప్రస్తుతం వర్ష పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. వర్ష సోషల్ మీడియా పోస్టులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె హాట్ హాట్ ఫొటోస్ పెడుతుంది అని కాదు..సర్కాస్టిక్ గా పెట్టే క్యాప్షన్స్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఆమె మీద ఆమె పంచ్ లు వేసుకుంటుంది. కౌంటర్లు, సెటైర్లు ఇలా ఏది అనుకున్నా పర్లేదు. మోడ్రన్ డిజైనర్ డ్రెస్ లో కింద ప్యాంట్ వేసుకోకుండా ఫొటోస్ పెడితే.. ప్యాంట్ ఏదమ్మా అని ఎవరు అడగకుండా ముందే క్యాప్షన్ గా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోలేదు అని క్యాప్షన్ పెట్టేస్తుంది.
ఇలా ప్రతి ఫొటోకు అద్భుతమైన క్యాప్షన్స్ ఇస్తూ ఒక మీమర్ గా మారిపోయింది. తాజాగా వర్ష మరోసారి తనలోని కామెడీ టైమింగ్ ను బయటపెట్టింది. తాజాగా వర్ష బొల్లమ్మ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. బ్లూ కలర్ డెనిమ్ షర్ట్ మాత్రమే వేసుకొని బీచ్ ఒడ్డున పరుగులు తీస్తూ అలలతో పోటీ పడుతూ కనిపించింది. ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా సిగ్గులేకుండా ‘సీ’చ్యువేషన్ షిప్ లో ఉన్నాను అంటూ రాసుకొచ్చింది. అంటే.. సముద్రంతో ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక వర్ష ఫోటోలకు, ఆ క్యాప్షన్ కు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అసలు అలాంటి క్యాప్షన్స్ ఎలా వస్తాయి నీకు అని కొందరు.. సిచ్యువేషన్ షిప్ లో ఉన్న ఆనందంలో ప్యాంట్ వేసుకోవడం కూడా మర్చిపోయావా అని ఇంకొందరు.. ఏదిఏమైనా నీ ఫోటోలు, నీ క్యాప్షన్ సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.