E-Paper
Advertisement

డైలాగ్ చేంజెస్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న కొరియన్ కనకరాజు.. రన్ టైమ్ లాక్!

డైలాగ్ చేంజెస్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న కొరియన్ కనకరాజు.. రన్ టైమ్ లాక్!
Advertisement

Korean kanakaraju: మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్(Varun Tej) గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. అందులో భాగంగానే ఈసారి ఏకంగా జానర్ మార్చి కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే కొరియన్ కనకరాజు. ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు ఇండో కొరియన్ హారర్ కామెడీ ఇది. మిరాయ్ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న రితికా నాయక్(Rithika Naik) ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. ప్రముఖ నటుడు సత్య(Sathya) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఆగస్టు ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న కొరియన్ కనకరాజు..

సాధారణంగా ఏ సినిమా అయినా సరే సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాతనే విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు, 16 సంవత్సరాల పైబడిన వారు ఈ సినిమా చూడడానికి సెన్సార్ సభ్యులు అనుమతి కల్పించారు.

రన్ టైమ్ లాక్ చేసుకున్న కొరియన్ కనకరాజు..

Advertisement

ఇకపోతే ఈ చిత్రానికి రన్ టైం కూడా లాక్ చేశారు. పైగా ఈ సినిమాలోని కొన్ని అసభ్యకర, అభ్యంతరకర డైలాగ్స్ చేంజ్ చేస్తూ.. జీరో కట్స్ తో సుమారుగా 2:45 గంటల నిడివితో రన్ టైం లాక్ చేశారు. మొత్తానికైతే సినిమాలో ఎటువంటి కట్ చెప్పకుండా.. కేవలం డైలాగ్స్ చేంజ్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? 2:45 గంటలపాటు డైరెక్టర్ ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెడతారా? అనే విషయం తెలియాలి అంటే ఆగస్టు 7 వరకు ఎదురు చూడాల్సిందే.

also read:రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

అనంతపురం బ్యాక్ డ్రాప్లో కొరియన్ కనకరాజు..

Advertisement

ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ఈ సినిమాను రాయలసీమ అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. డైరెక్టర్ మాట్లాడుతూ..” నేను ఒక పెళ్ళికి అనంతపురం మీదుగా వెళుతున్న సమయంలో.. పెనుగొండ దగ్గర ఉన్న కియా కార్ కంపెనీ వద్ద ఆగాను. అక్కడ కొరియన్ వారికి ప్రత్యేకంగా వసతులు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయాను. అదే సమయంలో కొరియన్ ఆత్మ అనంతపురం కుర్రాడిలోకి ఆవహిస్తే ఎలా ఉంటుంది అని కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో కథను రాసుకున్నాను ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇందులో వరుణ్ తేజ్ కొరియన్ ఆత్మ ఆవహిస్తే ఎలా అనే షేడ్ లో చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా రాయలసీమ యాస ఆయనకు కొత్త అయినా సరే తన కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా ద్వారా లభిస్తుంది” అంటూ కామెంట్ చేశారు. ఇక మొత్తానికి అయితే సినిమాపై అంచనాలు పెంచేశారు డైరెక్టర్.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×