రైళ్లలో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైల్వే ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే, రైల్వే ఫుడ్ విషయంలో అడ్డగోలు ధరలు ఉండకూడదనే ఉద్దేశంతో ఎమ్మార్పీని కచ్చితంగా అమలు చేయాలనే రూల్ తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లతో పాటు రైల్లోను నిర్ణయించిన ధరను మించి అధిక రేట్లకు అమ్మకూడదని తేల్చి చెప్పింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. అయినప్పటికీ, వెండర్స్ తీరు మార్చుకోవడం లేదు. రైల్వే క్యాటరింగ్ సిబ్బంది కూడా అధిక ధరలకు తినుబండారాలను అమ్ముతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రయాణీకులు రైల్వే అధికారులు ఫిర్యాదు చేస్తే, మూకుమ్మడికిగా క్యాటరింగ్ సిబ్బంది వచ్చి దాడి చేస్తున్నారు. తాజాగా ఓ ఫిర్యాదుదారుడిపై రైల్వే క్యాటరింగ్ సిబ్బంది దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
11463 నెంబర్ గల సోమనాథ్ జబల్పూర్ ఎక్స్ ప్రెస్ లో రైల్వే క్యాటరింగ్ సిబ్బంది.. ఓ ప్రయాణీకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. వాటర్ బాటిల్ సహా ఇతర ఆహార పదార్థాలపై ఎమ్మార్పీకి మించి డబ్బులు వసూలు చేసినట్లు రైల్వే సేవకు ఫిర్యాదు చేశాడు. వెంటనే, రైల్వే సేవ అధికారుల నుంచి సదరు క్యాటరింగ్ సిబ్బందికి కాల్ వచ్చింది. వెంటనే సదరు ప్రయాణీకుడి దగ్గర ఎక్కువగా తీసుకున్న డబ్బులను వెనక్కి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. సరే అని చెప్పిన క్యాటరింగ్ సిబ్బంది ఆ తర్వాత అసలు స్వరూపం చూపించారు.
ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడిపై దాడి
రైల్వే సేవా అధికారుల నుంచి కాల్ రాగానే, సదరు క్యాటరింగ్ సిబ్బందికి కోపం ఓ రేంజ్ లో తన్నుకొచ్చింది. తమ మీదే కంప్లైంట్ చేస్తాడా? అంటూ నేరుగా ప్రయాణీకుడి సీటు దగ్గరికి వచ్చారు. ఎందుకు ఫిర్యాదు చేశావంటూ పిడిగుద్దులు కురిపించారు. ఇతర ప్రయాణీకులు జోక్యం చేసుకున్నా ఆగలేదు. తమ కోపాన్ని అంతటినీ ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే సదరు క్యాటరింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తోటి ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.
Passenger complained to @RailwaySeva about caterer overcharging. RailSeva takes the PNR and seat no. and passes them to irctc to solve it, who tells the contractor, who tells his men, and they come beat up the passenger.
I’ve seen at least two more such cases. Complain, share… pic.twitter.com/tTeHgch9Fi
— THE SKIN DOCTOR (@theskindoctor13) July 17, 2025
ఫిర్యాదులను పరిష్కరించే విధానం ఇదేనా?
అటు అధిక ధరలపై ఫిర్యాదులు, వాటిని పరిష్కరించే విధానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకుల నుంచి ఫిర్యాదు అందగానే.. రైల్ సేవ PNR నెంబర్, సీటు నంబర్ తీసుకొని దాన్ని పరిష్కరించడానికి irctcకి పంపుతుంది. అక్కడి నుంచి కాంట్రాక్టర్‌కి చెప్తారు. అతను తన మనుషులకు చెబుతాడు. వాళ్లు వచ్చి వచ్చి ప్రయాణీకుడిని కొడతారు. ఇలాంటి ఘటనలు కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదులను థర్డ్ పార్టీతో దర్యాప్తు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఫిర్యాదు ఎవరికి వ్యతిరేకంగా ఉందో వారితోనే ప్రయాణీకుల వివరాలను పంచుకోవడం, ఆపై నేరుగా సంప్రదించమని బలవంతం చేయడం అర్ధరహితం అంటున్నారు. ఈ పద్దతి మారాలంటున్నారు. కొద్ది రోజుల క్రితం రైలు నెంబర్ 14609 హేమకుంట్ ఎక్స్ ప్రెస్ లోనూ ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడిపై రైల్వే క్యాటరింగ్ సిబ్బంది దాడి చేయడం సంచలనం కలిగించింది.
Read Also: ఇన్స్టాలో అందాల ఆరబోత.. ఇప్పుడు జైల్లో.. నెలకు వీరి సంపాదన ఎంతో తెలుసా?