E-Paper
Advertisement

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!
Advertisement

WhatsApp Restricted Chat: మనలో చాలామంది వాట్సప్‌ను కేవలం ఫోన్‌లోనే కాకుండా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు లేదా వేరే సెకండరీ ఫోన్లలో Linked Devices ద్వారా వాడుతుంటారు. ఆఫీసు పనిలో ఉన్నప్పుడు ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వాడటం చాలా సౌకర్యంగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన వ్యక్తిగత లేదా సీక్రెట్ చాటింగ్స్ పక్కన ఉన్నవారికి కనిపిస్తాయేమోనని కాస్త భయంగా అనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సప్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

రిస్ట్రిక్టెడ్ చాట్ ఫీచర్..

వాట్సప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ పేరు Restricted Chat. ఇదివరకే ఉన్న అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీకి ఇది అప్‌డేటెడ్ వెర్షన్. ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే.. మనం ఎంచుకున్న ప్రత్యేకమైన చాట్స్ కేవలం మన మెయిన్ ఫోన్‌లో మాత్రమే కనిపిస్తాయి. మనం లాగిన్ అయిన కంప్యూటర్లు, ట్యాబ్స్ లేదా ఇతర లింక్డ్ డివైజ్ సరికొత్తగా ఆ మెసేజ్‌లను సింక్ చేయవు. దీనివల్ల ప్రైవసీకి మరింత భద్రత లభిస్తుంది.

Advertisement

Also Read: స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఎలా పనిచేస్తుంది?

ఈ ఫీచర్ వాడటం చాలా తేలిక. మనకు కావలసిన వ్యక్తి చాట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లోకి వెళ్లి దీనిని ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. ఒకసారి ఎనేబుల్ చేస్తే.. ఆ కాన్వర్సేషన్ మెసేజ్‌‌లు కేవలం ప్రైమరీ ఫోన్‌కే పరిమితమవుతాయి. వెబ్ వెర్షన్ లేదా డెస్క్‌టాప్ యాప్స్ ద్వారా ఎవరూ వాటిని చూడలేరు. థర్డ్ పార్టీ యాప్స్, ఇతర ఏఐ ఏజెంట్ల ద్వారా సమాచారం చోరీ కాకుండా ఇది అడ్డుకుంటుంది.

అదనపు సెక్యూరిటీ..

Advertisement

కేవలం చాట్ దాచడమే కాకుండా మరికొన్ని ప్రైవసీ రూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఆ చాట్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలు ఫోన్ గ్యాలరీలోకి ఆటోమేటిక్‌‌గా సేవ్ కావు. అలాగే ఆ చాట్‌ను వేరే చోటికి ఎగుమతి చేయడానికి లేదా అందులో మెటా ఏఐ ఫీచర్లు వాడటానికి కుదరదు. దీనివల్ల మన వ్యక్తిగత డేటా ఎక్కడికీ లీక్ కాకుండా చాలా సేఫ్‌గా ఉంటుంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లలో కొందరికి మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అందరికీ ఎప్పుడు విడుదల చేస్తారనేది వాట్సప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా మనం చేసే ప్రతీ మెసేజ్, కాల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌‌తో సురక్షితంగానే ఉంటాయి. కాకపోతే మన డివైజ్ పక్కన ఉన్నవాళ్లకు కనిపిస్తుందేమో అని కంగారుపడేవారికి ఇది నిజంగా ఒక గ్రేట్ అప్‌డేట్ అని చెప్పవచ్చు.

Also Read: ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

Tags

Related News

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!

Big Stories

Advertisement
×