E-Paper
Advertisement

తెలుగు హీరోలతో సినిమాలు ఎందుకు చేయట్లేదు ?.. వెంకీ చెప్పిన కారణం ఇదే!

తెలుగు హీరోలతో సినిమాలు ఎందుకు చేయట్లేదు ?.. వెంకీ చెప్పిన కారణం ఇదే!
Advertisement

Venky Atluri:సినిమా ఇండస్ట్రీలో సినిమా పట్టాలెక్కడం అంత ఈజీ కాదు. హీరో డేట్స్, కమిట్‌మెంట్స్, వరుస సినిమాలు.. ఇలా చాలా లెక్కలుంటాయి. ఇక కోవిడ్ తర్వాత అయితే ఈ లెక్కలు మరింత మారిపోయాయి. ఇదే విషయాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన సూర్యతో ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా చేస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అట్లూరి.. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి సినిమాలు తెలుగు హీరోలతో ఎందుకు చేయలేదో అసలు కారణం బయటపెట్టారు.

వెంకీ అట్లూరి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ‘సార్’ సినిమా. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదలై మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ చేసి మరోసారి మెప్పించారు వెంకీ. దీంతో అసలు వరుసగా వేరే ఇండస్ట్రీ హీరోలతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.

కోవిడ్ తర్వాత మొత్తం లెక్కలు మారిపోయాయి

Advertisement

కోవిడ్ తర్వాత సినిమాల రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని వెంకీ అట్లూరి చెప్పారు. అప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం అంటూ వేరువేరుగా ఉన్న మార్కెట్లు.. కోవిడ్ తర్వాత క్రమంగా గ్లోబల్ మార్కెట్ వైపు వెళ్లాయని అన్నారు. అదే టైంలో మన తెలుగు హీరోలు కూడా వరుస సినిమాలతో బిజీ అయిపోయారని చెప్పారు.

దాంతో తన దగ్గర కథ ఉన్నా.. వెంటనే సినిమా మొదలుపెట్టే ఛాన్స్ రాలేదట. దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వెంకీ తెలిపారు. అప్పుడు ‘ఇక నెక్ట్స్ ఏంటి?’ అని ఆలోచించడం మొదలుపెట్టారట. తెలుగు హీరోల దగ్గర డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో తెలియని పరిస్థితి. అదే సమయంలో ధనుష్ కథలు వింటున్నారని వెంకీకి తెలిసిందట.

అందుకే ధనుష్ దగ్గరికి వెళ్లారట!

Advertisement

అంతే.. ఒకసారి కథ చెప్పి చూద్దాం అనుకుని ధనుష్ దగ్గరికి వెళ్లారట. కానీ అక్కడికి వెళ్లేటప్పుడు సినిమా ఓకే అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదట. ‘కథ చెబుదామని మాత్రమే వెళ్లాను. నచ్చుతుందో లేదో, సినిమా చేస్తారో లేదో ఏమీ తెలియదు’ అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.

ఇంకో విషయం ఏంటంటే.. ధనుష్ కూడా అప్పట్లో ఫుల్ బిజీగా ఉన్నారట. వెంటనే సినిమా చేయడం కుదరదని, దాదాపు ఆరు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందని వెంకీకి తెలిసిందట. అయితే వెంకీ ఆలోచన మాత్రం చాలా సింపుల్‌గా ఉందట.

‘ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉండడం కంటే.. ఆరు నెలలు వెయిట్ చేయడం బెటర్ కదా’ అని అనుకున్నారట.

కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్!

కానీ కథ విన్న ధనుష్‌కి అది బాగా నచ్చేసిందట. అంతేకాదు.. ‘సినిమా చేద్దాం’ అని వెంటనే చెప్పేశారట. అలా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కథ చెప్పడానికి వెళ్లిన వెంకీకి.. ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా మొదలైనదే ‘సార్’ సినిమా.

‘సార్’తో వెంకీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్

ఈ సినిమా వెంకీ అట్లూరి కెరీర్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. విద్యా వ్యవస్థలోని లోపాలను టచ్ చేస్తూనే కమర్షియల్‌గా కూడా సినిమాను బాగా నడిపించారు. ధనుష్‌కి కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇక ‘సార్’ తర్వాత వెంకీ మరోసారి తెలుగు హీరో కాకుండా దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ చేశారు. ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో వెంకీకి తెలుగు, తమిళం అనే బౌండరీలు లేకుండా కథకు తగ్గ హీరోను ఎంచుకునే దర్శకుడిగా గుర్తింపు వచ్చింది.

ఇప్పుడు సూర్యతో ‘విశ్వనాథ్ & సన్స్’

ఇప్పుడు ‘విశ్వనాథ్ & సన్స్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సూర్య హీరోగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఆగస్ట్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది.

ALSO READ:ఇవేం డ్రామాలు ప్రకాశ్ రాజ్? అసలు నిజం చెప్పేసిన ఈసీ, కారణం ఇదేనట!

అంటే.. ‘హీరో ఎవరైనా పర్లేదు, కథకు సెట్ అయితే చాలు’ అన్నట్టుగా వెంకీ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట. మరి ఇప్పుడు సూర్యతో చేస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags

Related News

థియేటర్‌లో చూసిన హీరో పక్కనే.. ఇప్పుడు హీరోయిన్‌గా!..ఇరుముడి ఈవెంట్లో ప్రియా భవాని శంకర్!

చదువులో ఫెయిల్.. సినిమాల్లో మాత్రం సక్సెస్.. ‘ఇరుముడి’ ఈవెంట్‌లో రవితేజ ఆసక్తికర కామెంట్స్!

ఇవేం డ్రామాలు ప్రకాశ్ రాజ్? అసలు నిజం చెప్పేసిన ఈసీ, కారణం ఇదేనట!

నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్.. ఇంత హైప్ అవసరమా బాబోయ్!

‘ఇరుముడి’ ట్రైలర్.. రూటు మార్చిన రవితేజ, ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా!

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ అందుకున్న బ్యూటీస్!

లాంగ్ హెయిర్.. స్లిమ్ లుక్.. ‘RC17’లో చరణ్ కొత్త అవతార్!

Big Stories

Advertisement
×