E-Paper
Advertisement

పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!

పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!
Advertisement

URBN 10000 mAh Ultra Compact power bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఆఫీసు పని మీద బయటికి వెళ్లినప్పుడు ఫోన్ బ్యాటరీ డౌన్ కావడం సర్వసాధారణం. ఈ చిన్న సమస్యకు పెద్ద పరిష్కారంగా ప్రముఖ బ్రాండ్ URBN మార్కెట్లోకి ఒక అద్భుతమైన గాడ్జెట్‌ను మార్కెట్ లోకి తెచ్చింది. అదే URBN 10000 mAh 22.5W అల్ట్రా కాంపాక్ట్ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్. కేవలం రూ. 999 ధరకే లభిస్తున్న ఈ పవర్ బ్యాంక్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి వివరాలు:

అల్ట్రా కాంపాక్ట్ డిజైన్ , క్యామో లుక్:

ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ దాని డిజైన్. 10000mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్నప్పటికీ, ఇది అరచేతిలో ఇమిడిపోయేలా అత్యంత చిన్నదిగా రూపుదిద్దుకుంది. దీన్ని జేబులో లేదా చిన్న హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకోవడం చాలా ఈజీ. దీనికి ఇచ్చిన క్యామో డిజైన్, కలర్ టోన్ దీనికి ఒక ట్రెండీ లుక్‌ను ఇస్తుంది. ఎక్కడికైనా.. ట్రిప్స్‌కి వెళ్లేటప్పుడు స్టైలిష్‌గా క్యారీ చేయడానికి ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

లిథియం పాలిమర్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్:

Advertisement

సైజులో చిన్నదిగా ఉన్నప్పటికీ..పవర్ విషయంలో ఇది చాలా గట్టి పోటీ.. ఇస్తుంది. ఇందులో.. ఉన్న 10000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ మీ స్మార్ట్‌ ఫోన్‌ను ఈజీగా ఒకటి నుంచి రెండు సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అంతే కాకుండా.. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. దీని వల్ల మీ మొబైల్ సాధారణ పవర్ బ్యాంక్‌ల కంటే చాలా వేగంగా ఛార్జ్ ఎక్కుతుంది. తద్వారా మీ విలువైన టైమ్ ఆదా అవుతుంది.

Also Read: ఈ ఎయిర్ ఫ్రైయర్లతో.. కరెంట్ బిల్లు, టైమ్ సగం ఆదా!

మల్టిపుల్ డివైజ్ కంపాటిబిలిటీ:

Advertisement

ఈ పవర్ బ్యాంక్ కేవలం స్మార్ట్‌ ఫోన్‌ల ఛార్జింగ్‌కే.. పరిమితం కాదు. స్మార్ట్‌ వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్, ట్యాబ్లెట్లు, బ్లూటూత్ స్పీకర్లు వంటి అనేక రకాల చిన్న గాడ్జెట్లను కూడా దీని ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు.. మీ ఫోన్‌తో పాటు ఇయర్‌ బడ్స్ లేదా స్మార్ట్‌ వాచ్‌కు బ్యాటరీ అయిపోతే.. ఈ ఒక్క చిన్న డివైజ్ ఉంటే సరి పోతుంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర :

ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ.. దీని ధరను.. కేవలం రూ.999గా నిర్ణయించారు. మార్కెట్లో.. లభించే ఇతర బ్రాండ్ల తో పోలిస్తే, ఈ ధరకు ఇంతటి కాంపాక్ట్ సైజ్ , పర్ఫామెన్స్ లభించడం నిజంగా సామాన్యులకు ఒక గొప్ప ఆప్షన్ చెప్పాలి.

ఎక్కువ బరువు మోయలేక.. ఇబ్బంది పడే వారికి, రోజంతా బయటే తిరిగే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ అల్ట్రా కాంపాక్ట్ పవర్ బ్యాంక్ ఒక అద్భుతమైన ఛాయిస్. తక్కువ బడ్జెట్‌ లో.. నమ్మక మైన ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే వారికి.ఈ గార్జెట్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×