OTT Movie : హాలీవుడ్ సైకో సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని సినిమాలలో ఉండే హింస నరకంలో కూడా ఉండదు. వీళ్ళ కన్నా డేయాలే మేలనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక పట్టణంలో జరుగుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు, తిరిగి వెళ్ళడం అసాధ్యం గా మారుతుంది. కొంతమంది వింత మనుషులు, వీళ్ళను మాటల్లో చెప్పలేని విధంగా హింసిస్తారు. ఆ తరువాత చంపుతుంటారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్-హారర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘ఫ్రమ్’ (From). 2022లో వచ్చిన ఈ సిరీస్ ను జాన్ గ్రిఫిన్ రూపొందించారు. ఈ సిరీస్‌లో హారోల్డ్ పెరినో (బాయ్డ్ స్టీవెన్స్), కాటలినా సాండినో మోరెనో (టబితా మాథ్యూస్), ఈయోన్ బెయిలీ (జిమ్ మాథ్యూస్), డేవిడ్ అల్పే (జేడ్ హెరెరా), ఎలిజబెత్ సాండర్స్ (డోనా), స్కాట్ మెక్‌కార్డ్ (విక్టర్) వంటి నటులు నటించారు. ప్రస్తుతం మూడు సీజన్లు విడుదలయ్యాయి. (2022, 2023, 2024), నాల్గవ సీజన్ 2025 లో రాబోతోంది. ప్రతి సీజన్ 10 ఎపిసోడ్‌ల తో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఒక భయంకరమైన అమెరికన్ పట్టణంలో జరుగుతుంది. అక్కడ చిక్కుకున్న కొంత మంది వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ పట్టణంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు, కానీ బయటకు వెళ్లడం అసాధ్యం. బయటికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా, ఆ రోడ్డు ఎప్పుడూ తిరిగి పట్టణానికే తీసుకొస్తుంది. ఇక్కడ రాత్రివేళలో, భయంకరమైన గ్రహాంతర జీవులు మానవ రూపంలో కనిపించి, పట్టణవాసులను బయటకు రప్పించేలా చేస్తాయి. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే, వాటి చేతిలో దారుణంగా చనిపోతారు. అందువల్ల పట్టణవాసులు రాత్రి సమయంలో ఇండ్లలో దాక్కుని తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇక ఈ పట్టణంలోకి బాయ్డ్ స్టీవెన్స్, మాథ్యూస్, జిమ్, టబితా, ఈథన్ అనే వీళ్ళు కొత్తగా వస్తారు. ఇక ఈ వింత ప్రపంచంలోకి వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. వీళ్ళంతా ఇక్కడ బతకడానికి పోరాడుతారు. బాయ్డ్ ఈ పట్టణంలో తమని రక్షించు కోవడానికి, కొన్ని నియమాలను అమలు చేస్తాడు. టబితా, జిమ్ తమను కాపాడుకుంటూ, పట్టణంలో జరుగుతున్న రహస్యాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో మాథ్యూస్ కుటుంబం పట్టణంలో చిక్కుకుంటుంది. బాయ్డ్ మానసిక స్థితి క్షీణిస్తుంది. ఈ వింత జీవులు మరింత దూకుడుగా మారతాయి. టబితా ఒక లైట్‌హౌస్‌లో ఈ పట్టణం నుండి బయటపడే మార్గం ఉందని నమ్ముతుంది. చివరికి వీళ్ళంతా ఆ పట్టణం నుంచి బయట పడతారా ? ఆ వింత జీవుల చేతిలో బలవుతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : చెరువులో మృతదేహం… ఐఎండీబీలో 8.1 రేటింగ్… సడన్ గా ఓటీటీలోకి గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ