E-Paper
Advertisement

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్
Advertisement

Small Prophets OTT Release : భవిష్యత్తులో ఏం జరగబోతోందో ముందుగానే తెలుసుకోగలిగితే మన జీవితంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనిపిస్తుంది. మనకు ఇష్టమైన వ్యక్తి తిరిగి వస్తాడా ? మనం తీసుకునే నిర్ణయం సరైనదేనా ? రేపు ఏదైనా ప్రమాదం ఎదురవుతుందా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే చిన్న చిన్న మాయా జీవులు నిజంగానే ఉంటే ఎలా ఉంటుంది ? అలాంటి ఆలోచనకు హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, కొద్దిపాటి మాయాజాలాన్ని జోడించి తీసిన బ్రిటిష్ సిరీస్ Small Prophets. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? అన్న విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ కథలో మైఖేల్ అనే వ్యక్తి జీవితమే ప్రధానాంశంగా సాగుతుంది స్టోరీ. అతడి ప్రియురాలు క్లియా కనిపించకుండా పోయి ఏడేళ్లు గడిచిపోతాయి. ఇంతకాలం ఆమె గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో మైఖేల్ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆమె తిరిగి వస్తుందనే ఆశను పూర్తిగా వదులు కోలేకపోతాడు. అదే సమయంలో ఆమె కోసం ఎదురు చూస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలా, లేక ఆమె గురించి నిజం తెలుసుకునే ప్రయత్నం కొనసాగించాలా అనే సందిగ్ధంలో ఉంటాడు.

Advertisement

మైఖేల్ తండ్రి బ్రయన్ ఒక విచిత్రమైన ఆలోచనను అతడితో పంచుకుంటాడు. ఓ ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించి చిన్న మాయా జీవులను సృష్టించవచ్చని చెబుతాడు. వర్షపు నీరు, గుర్రపు పేడ, మరికొన్ని పదార్థాలను ఉపయోగించి చేసే ప్రయోగం ద్వారా హోమంకులై అనే చిన్న జీవులను తయారు చేయవచ్చనేది అతడి నమ్మకం. ఈ జీవులు భవిష్యత్తు గురించి సూచనలు ఇవ్వగలవని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవని భావిస్తారు.

క్లియా తిరిగి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే కోరికతో మైఖేల్ ఈ ప్రయోగం వైపు ఆకర్షితుడవుతాడు. మొదట ఈ ఆలోచన నమ్మశక్యంగా అనిపించకపోయినా, తన జీవితంలో ఉన్న అనిశ్చితికి ఓ ముగింపు దొరకవచ్చనే ఆశ అతడిని ముందుకు నడిపిస్తుంది. అయితే భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం ఒక్కటే అతడి సమస్య కాదు. తండ్రితో ఉన్న సంబంధం, తన ఒంటరితనం, జీవితంలో మళ్లీ ఆనందాన్ని వెతుక్కోవాలనే కోరిక కూడా అతడిని వెంటాడుతుంటాయి.

Advertisement

ఈ క్రమంలో మైఖేల్‌కు కాసీ అనే యువతితో పరిచయం ఏర్పడుతుంది. వారి మధ్య స్నేహం పెరుగుతుంది. మరోవైపు పొరుగువాడైన క్లైవ్, క్లియా సోదరుడు రాయ్ వంటి పాత్రలు కూడా అతడి జీవితంలో కీలక పాత్రలు పోషిస్తాయి. మాయా జీవులు చెప్పే విషయాలనే పూర్తిగా నమ్మాలా, లేక తన అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలా అనే ప్రశ్న మైఖేల్ ను ఆలోచింపజేస్తుంది. భవిష్యత్తును తెలుసుకోవాలనే కోరిక మనిషిని కొన్నిసార్లు వర్తమానానికి దూరం చేస్తుంది. గతాన్ని మర్చిపోలేకపోవడం, రేపటి గురించి ఆందోళన చెందడం మధ్య మనిషి తన ప్రస్తుత జీవితాన్ని ఎలా కోల్పోతాడో ఈ కథలో చూపించారు. మరి హీరో అనుకున్నట్టే ఆ మాయా జీవులను క్రియేట్ చేశాడా ? చివరికి ఏమైంది ? అన్నది సినిమాలో చూడాల్సిందే.

Also Read : గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

తెలుగులో ఉందా ?

‘స్మాల్ ప్రొఫెట్స్’లో పియర్స్ క్విగ్లీ మైఖేల్ పాత్రలో, మైఖేల్ పాలిన్ బ్రయన్ పాత్రలో, లారెన్ పటేల్ కాసీ పాత్రలో నటించారు. మెకంజీ క్రూక్ ఈ సిరీస్ ‌ను రూపొందించడంతో పాటు రచన, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆరు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్ 2026 అక్టోబర్ 7 నుంచి Apple TVలో విడుదలైంది. ఆడియో ఇంగ్లీష్‌తో పాటు మరికొన్ని భాషలు ఉన్నప్పటికీ, తెలుగులో మాత్రం లేదు.

Related News

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×