Jayammu Nischayammu raa season 2: ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు హోస్ట్ గా మరి ఎన్నో టాక్ షోలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెరపై మాత్రమే కాకుండా ఓటీటీలలో కూడా టాప్ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు(Jagapathi Babu) సైతం హోస్టుగా మారి గతంలో ఒక టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. జయమ్ము నిశ్చయమ్మురా (Jayammu Nischayammu raa)టాక్ షో జీ తెలుగులో ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇలా మొదటి సీజన్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే సీజన్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. సరికొత్త సర్ప్రైజ్ లతో ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా మొదటి సీజన్లో సెలబ్రిటీలతో జగపతిబాబు పాల్గొన్నటువంటి ఎపిసోడ్లకు సంబంధించిన ఫోటోలను మాత్రం చూపించారు.
ఇక రెండవ సీజన్లో భాగంగా ఈ కార్యక్రమంలో తిరిగి సెలబ్రిటీలు హాజరవుతారా? లేదా అనే విషయాల గురించి స్పష్టత రావాల్సి ఉంది. మొదటి సీజన్లో ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రేక్షకులకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక జగపతిబాబు హోస్టుగా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికే నాగార్జున బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా ఇలాంటి టాక్ షో ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు ఇక త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం మరొక టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
?srtk=MW5vM2licXQ4Z25pbw%3D%3D
చిరంజీవి హోస్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఒక టాక్ షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా స్టార్ హీరోలు అందరూ కూడా హోస్ట్ గా మారుతూ విభిన్నమైన కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. జగపతిబాబు కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు హీరోగా నటించి ఈయన ప్రేక్షకులను మెప్పించారు కానీ ఇటీవల విలన్ పాత్రలలో నటిస్తూ రెట్టింపు అభిమానాన్ని, పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో జగపతిబాబు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: బిగ్ బాస్ 10 విన్నర్ పై కౌశల్ మండా కామెంట్స్.. నవరసాలు పండిస్తున్న కంటెస్టెంట్ అంటూ!