Anchor Manjusha:మంజూష…యాంకర్‌గా, నటిగా, సినిమా ఈవెంట్స్ హోస్ట్‌గా చాలా కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ బొద్దుగుమ్మ గురించి స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు . ముఖ్యంగా సినిమా ఈవెంట్స్‌లో తనదైన స్టైల్‌తో కనిపిస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.ఇక ఎప్పుడు ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉండే ఈ భామ తాజాగా మంజూష తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ శారీలో చాలా స్టైలిష్‌గా కనిపించిన ఆమె లుక్ ఇప్పుడు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.
మెస్మరైజ్ అయిపోతున్న ఫ్యాన్స్
ఈ ఫొటోల్లో మంజూష బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోతుందనే చెప్పాలి.ముఖ్యంగా శారీకి ఉన్న సిల్వర్ బోర్డర్ అలాగే చిన్న చిన్న పువ్వుల డిజైన్లు ఉండటంతో లుక్‌కి మంచి ట్రెడిషనల్ టచ్ వచ్చిందనడం లో సందేహం లేదు. అదే సమయంలో కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకోవడంతో మోడరన్ లుక్ కూడా యాడ్ అయింది.ఇక చెవులకు జిమ్మికీలు, చేతికి ఉన్న బ్యాంగిల్స్ శారీకి బాగా సెట్ అవ్వడంతో ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ మెస్మరైజ్ అయిపోతున్నారు.
మాములుగా మంజూష తన ఫ్యాషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందన్న సంగతి తెల్సిందే. ఈవెంట్‌కి తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవడం, ట్రెడిషనల్ లుక్‌కి మోడ్రన్ టచ్ ఇవ్వడం ఆమె స్టైల్.ఇక అప్పుడప్పుడు శారీలో ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడం ఆమె స్పెషాలిటీ. ఇప్పుడు కూడా అలాగే బ్లాక్ శారీలో కనిపించి సోషల్ మీడియాలో తెగ దడి చేస్తుంది.
మంజూషకు యాంకర్‌గా మంచి గుర్తింపు రావడానికి సినిమా ఈవెంట్స్ కూడా ఒక కారణమనే చెపాలి.ఇక ఈ మధ్య టాలీవుడ్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో లాంచ్‌లు, సినిమా ప్రమోషన్ ఎక్కడా చూసినా ఈ బొద్దుగుమ్మే దర్శనమివ్వడం విశేషం.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా
అయితే మంజూష కేవలం యాంకర్ మాత్రమే కాదు. సినిమాలు, సీరియల్స్‌లో కూడా నటించిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రాఖీ’ సినిమాలో తారక్ కి చెల్లిగా మంజూష కనిపించి ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు తెప్పించింది.అయితే ఆ తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించ పోయినాసినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కనిపిస్తూ తన కెరీర్‌ను సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తుంది.
వైరల్ చేసే పనిలో పడ్డ ఫాలోవర్స్
ఇక మంజూష సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి చెప్పక్కర్లేదు. తన ఫ్యాషన్ ఫొటోషూట్స్‌తో పాటు ఈవెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది. ఇక ఆమె పెట్టే ఫొటోలకు ఫాలోవర్స్ నుంచి మంచి రియాక్షన్ వస్తుంది కూడా .
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫొటోలు వైరల్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్లు తమ కొత్త లుక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే అభిమానులు వెంటనే వాటిని వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు మంజూష బ్లాక్ శారీలో ఫొటోలు కూడా ఫాలోవర్స్ వైరల్ చేసే పనిలో పడ్డారు.
మొత్తానికి సినిమాలు, సీరియల్స్, యాంకరింగ్ అంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్న మంజూష.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన స్టైలిష్ లుక్స్‌తో కూడా సందడి చేస్తుందన్న మాట !
ALSO READ:తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?