Kingdom Review:రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై యాక్షన్ పవర్ ప్యాక్డ్ తో రాబోతున్న ఈ ‘కింగ్డమ్’ చిత్రానికి గౌతం తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. అలాగే ప్రముఖ నటుడు సత్యదేవ్ (Sathyadev) విజయ్ దేవరకొండకు అన్న పాత్ర పోషిస్తూ ఉండగా.. మరొకవైపు మలయాళ నటుడు వీపీ వెంకటేష్ (VP Venkatesh) విలన్ పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఎప్పుడో మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాలవల్ల జూలై 4కి వాయిదా పడింది. కనీసం అప్పుడైనా విడుదలవుతుందంటే.. ఇప్పుడు జూలై 31కి వాయిదా వేశారు. ఇక అలా రెండు సార్లు వాయిదా పడి.. ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా.
కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ..
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమాపై ప్రముఖ నిర్మాత నాగ వంశీ (Naga Vamshi), ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga) తమ అభిప్రాయాలను పంచుకోగా.. తన ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. సాధారణంగా ఎంత గొప్ప సినిమా అయినా సరే నెగిటివ్ రివ్యూ ఇచ్చే ఉమైర్ సంధు.. తొలిసారి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి ఏకంగా 3/5 రేటింగ్ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పవచ్చు.
బ్లడ్ బాత్ కి సిద్ధంకండి.. విజయ్ వన్ మ్యాన్ షో..
ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ విషయానికి వస్తే.. ఒకవైపు ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకుంటున్న ఈయన.. తన రివ్యూ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తున్నాడు. ఇది విజయ్ వన్ మ్యాన్ షో.. యాక్షన్ సీన్లతో అదరగొట్టేసాడు. ఆడియన్స్ ని కట్టిపడేసాడు. ఇక స్టోరీ , స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఓవరాల్గా డీసెంట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ.. మొత్తానికి కింగ్డమ్ తో విజయ్ ఏకంగా కుంభస్థలమే కొట్టబోతున్నాడు. బ్లడ్ బాత్ కి రెడీ కండి అంటూ పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే విజయ్ దేవరకొండ మూవీకి ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ పూనకాలు తెప్పిస్తోంది.
సినిమాపై అంచనాలు పెంచేసిన సెలబ్రిటీస్..
ఇదిలా ఉండగా దర్శకుడు సందీప్ రెడ్డివంగా కూడా.. 50 నిమిషాల సినిమా చూశాను అని, మ్యాడ్ ఉందని, సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అని తెలిపారు.
అలాగే నిర్మాత నాగ వంశీ కూడా మాట్లాడుతూ.. కింగ్డమ్ మూవీ ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. రివ్యూ ఫార్మాట్లో ఆ ఏవైతే కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో తగ్గేదెలే అంటూ తెలిపారు.
ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ కూడా సినిమాపై అంచనాలు పెంచేశారు. కింగ్డమ్ మూవీ తన సినీ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ అవుతుందని చెప్పుకొచ్చారు.
దీనికి తోడు అటు సెన్సార్ రిపోర్ట్ కూడా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. పెద్దగా కట్స్ ఇవ్వలేదు. కేవలం కొన్ని పదాలను మాత్రమే మ్యూట్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఊహించని బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని చెప్పవచ్చు.
ALSO READ:Hit and Run Case: హత్యకేసులో ప్రముఖ నటి అరెస్ట్.. ఫుటేజ్ తో బయటపడ్డ నిజం!
First Review #Kingdom from Censor Board! Thank God #VijayDevarakonda is Back after Disaster movies. Kingdom is ONE MAN SHOW. He stole the Show in movie specially terrific action stunts by him. Story and screenplay is mediocre. Overall A Decent Mass Entertainer.
3 🌟/ 5 🌟 pic.twitter.com/78VTO1qeed
— Umair Sandhu (@UmairSandu) July 30, 2025