Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా మామూలుగా లేదు. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కామెడీ వీడియో, జంతువుల వీడియోలు తెగ షేర్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక పాముల వీడియోలకు అయితే నిమిషాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అనకొండ, కొండచిలువ, నాగుపాములు, ర్యాట్ స్నేక్ లకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి సూచించిన ప్రకారం పాము ఏది చెబితే అదే చేస్తోంది. అతను చెప్పినట్టు ఆ పాము చనిపోయినట్టు నటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
?utm_source=ig_web_copy_link
యజమాని చెప్పినట్టు ఆ పెంపుడు స్పర్శకు రెస్పాండ్ అవుతోంది. పాము కోరలను బయటకు తీసి.. తలను నేలపై వేసి.. మళ్లీ ఆకాశం వైపు చూస్తున్నట్టు ఓ వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. దీనికి సంబంధించి వీడియోను నెటిజన్లు తెగ చూస్తున్నారు. అంతేకాకుండా పాములంటే భయపడే వారు కూడా ఈ వీడియోను ఇష్టపడకుండా ఉండలేకపోయారు. ఈ వీడియో పోస్టు చేసిన ఒక్క రోజులోనే 4 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
ALSO READ: Snake Video: నువ్వు సూపర్ బామ్మ.. 70 ఏళ్ల వయస్సులో భారీ పామును అవలీలగా..! వీడియో వైరల్
పామును ఇలా శిక్షణ ఇవ్వడం ఎలా సాధ్యమైందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ‘ఈ పాముకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి’ అని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ‘పామును ఇలా చనిపోయినట్లు నటించేలా ఎలా శిక్షణ ఇస్తారు?’ అని మరొకరు కామెంట్ చేశాడు. ‘ఈ పాము చాలా తెలివైనది.. దీని మైండ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే’ అని మరొకరు హాస్యాస్పదంగా కామెంట్ చేశారు. ‘నాకు ఈ రోజు వరకు పాములు ఇలాంటి ట్రిక్స్ నేర్చుకునేంత తెలివిగా ఉంటాయని తెలియదు. ఇది హాస్యాస్పదమే కాదు, చాలా అందమైనది కూడా. అయితే, నాకు పాములంటే భయం’ అని మరొక వ్యక్తి రాసుకొచ్చాడు. నా బాయ్‌ఫ్రెండ్ నేను గిన్నెలు కడగమని అడిగినప్పుడు ఇలాగే చేస్తాడు’ అని మరొకరు కామెంట్ చేసుకొచ్చారు.
ALSO READ: Weather News: ఈ ఏడు రోజులు వర్షానికి బ్రేక్.. ఆ తర్వాత మళ్లీ దంచుడే..
ఈ వీడియో చూసిన వారు పాముల గురించి తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. “నేను చూసిన ప్రతి పెంపుడు పాము ఒక చిన్న స్వీట్‌హార్ట్‌లా ఉంటుంది, వాటికి వ్యక్తిత్వం ఉంటుంది” అని ఒక వ్యక్తి తెలిపారు. ఈ వీడియో పాములు కూడా శిక్షణ పొందగలవని, అవి కేవలం భయంకరమైన జీవులు మాత్రమే కాదని తెలియజేసింది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.