BigTV English

Monsoon Food: వర్షాకాలంలో ఇవి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు !

Monsoon Food: వర్షాకాలంలో ఇవి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు !

Monsoon Food: వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఈ సీజన్‌లో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, ప్లూలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో మన రోగ నిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలోనే తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇందుకోసం ఖరీదైన సప్లిమెంట్లతో పాటు అరుదైన ఆహార పదార్థాలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ రోజు వారీ ఆహారంలో సులభంగా లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ పదార్థాలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. అల్లం:
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దీనిని టీలో కలుపుకోవడం, కూరల్లో వాడటం లేదా గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి తాగడం చాలా మంచిది. ఫలితంగా వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

2. వెల్లుల్లి:
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచే గుణాలను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది రోజుకు 2-3 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం లేదా కూరల్లో ఎక్కువగా వాడటం అలవాటు చేసుకోండి.


3. పసుపు:
వంటకాల్లో పసుపు లేనిదే ఏ కూర ఉండదు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. పసుపు పాలు (గోల్డెన్ మిల్క్) తాగడం లేదా వంటల్లో పసుపు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

4. ఆకుకూరలు:
తోటకూర, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలు విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ సి, కె), ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో.. ఉపయోగపడతాయి. అంతే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని కూరలు, పప్పులు లేదా సూప్‌లలో కూడా తరచుగా ఉపయోగించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

5. పుల్లని పండ్లు (సిట్రస్ ప్రూట్స్):
నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తికి అవసరం అయిన అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి.. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అందుకే రోజుకు ఒక నిమ్మరసం లేదా ఒక నారింజ పండు తీసుకోవడం చాలా ప్రయోజనకరం.

6. పెరుగు:
పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) ఉంటాయి. ఇవి గట్ (పేగు) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన గట్ రోగ నిరోధక వ్యవస్థకు పునాది. వర్షాకాలంలో రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి.. రోగనిరోధక శక్తి  కూడా పెరుగుతుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Also Read: హైబీపీ ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

7. తులసి:
తులసిని ఆయుర్వేదంలో ఒక పవిత్రమైన మూలికగా పరిగణిస్తారు. ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగడం వల్ల జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

8. పప్పులు, చిక్కుళ్ళు:
శనగలు, పెసర్లు, కందిపప్పు వంటి పప్పులు, చిక్కుళ్ళలో ప్రోటీన్, ఫైబర్ తో పాటు ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించి.. రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. సూప్‌లు, కూరలు లేదా సలాడ్‌లలో వీటిని చేర్చుకోవచ్చు. వీటిని వర్షా కాలంలో తరచుగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Related News

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Raksha Bandhan: తల్లి కొడుకుకి రాఖీ కట్టొచ్చా? హిందూ సాంప్రదాయం ఏం చెబుతుంది?

Curd: అమ్మ బాబోయ్.. పెరుగుతో వీటిని తింటే విషంతో సమానమా..?

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?

Snoring in sleep: నిద్రలో గురక… గుండెకు గండమా?

Onions: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

Big Stories

×