E-Paper
Advertisement

Kodava Wedding: విరోష్ వివాహంలో పంది మాంసం తినాల్సిందేనా?.. కొడవ సాంప్రదాయాలు వెనుక సీక్రెట్ ఇదే..

Kodava Wedding: విరోష్ వివాహంలో పంది మాంసం తినాల్సిందేనా?.. కొడవ సాంప్రదాయాలు వెనుక సీక్రెట్ ఇదే..
Advertisement

Kodava Wedding: తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహం ఇటీవల అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం ఒకే పద్ధతిలో కాకుండా, అటు తెలుగు మరియు ఇటు కొడవ (కూర్గ్) సంప్రదాయాల ప్రకారం వీరు రెండుసార్లు వివాహం చేసుకోవడం విశేషం. ఈ వివాహ వేడుకలో చర్చనీయాంశమైన ముఖ్యమైన అంశం ‘కొడవ’ తెగ ఆచారాలు.

Read also-Sravanthi Chokkarapu: అనసూయ వెళ్లిపోవడమే ప్లస్ అయ్యిందా? అసలు విషయం బయటపెట్టిన యాంకర్ స్రవంతి చొక్కారపు

కొడవ సంప్రదాయం..

Advertisement

కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన వారు కొడవలు. వీరు పురాతన కాలం నుండి యుద్ధ వీరులుగా పేరుగాంచారు. వీరి వివాహ పద్ధతులు మన సాధారణ హిందూ వివాహాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ పెళ్లిళ్లలో పురోహితులు ఉండరు, వేద మంత్రాల ఉచ్చారణ ఉండదు. కేవలం పెద్దల ఆశీర్వచనాలే ప్రధానం. వివాహ వేడుకలో భాగంగా వరుడు తలపాగా ధరించి, నడుముకు కత్తిని ధరిస్తాడు.

పంది మాంసం ఎందుకు వడ్డిస్తారు?

కొడవ సంప్రదాయ వివాహాల్లో ‘పంది మాంసం’ (Pork) వడ్డించడం అనేది ఒక అనివార్యమైన ఆచారం. దీని వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. వారి నమ్మకం ప్రకారం, పూర్వకాలంలో వారి తెగను రక్షించడానికి పార్వతీ దేవి అడవి పంది రూపంలో వచ్చిందని భావిస్తారు. అందుకే ఆ తెగ వారు పందిని గౌరవిస్తూ, తమ ఇంట్లోని ప్రతి శుభకార్యంలో పంది మాంసాన్ని ప్రత్యేక వంటకంగా వండుతారు. రష్మిక తన మూలాలను మరువకుండా, తన సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహ విందులో కూడా ఈ పద్ధతిని అనుసరించినట్లు సమాచారం. కొడవ పెళ్లిళ్లలో మరో ఆసక్తికరమైన ఘట్టం ‘అరటి చెట్టును నరకడం’. వరుడు తన బలాన్ని, వీరత్వాన్ని నిరూపించుకోవడానికి వరుసగా ఉంచిన అరటి చెట్టు కాండాలను ఒకే వేటుతో నరకాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండ కూడా ఈ ఆచారాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించడం విశేషం.

Advertisement

Read also-Intinti Ramayanam Today Episode: మనసు మార్చుకున్న చక్రధర్.. అవనిని కూతురుగా ఒప్పుకుంటాడా..? పల్లవి నెక్స్ట్ ప్లాన్..

డిజిటల్ డిటాక్స్ – నో సెల్ ఫోన్స్

ఈ వివాహంలో మరో అద్భుతమైన నిర్ణయం ఏంటంటే, అతిథులెవరూ సెల్ ఫోన్లు వాడకూడదని నిబంధన పెట్టడం. ప్రస్తుత కాలంలో పెళ్లికి వచ్చిన వారు కేవలం ఫోటోలు, వీడియోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, ఈ జంట పాత కాలం నాటి పద్ధతిలో అందరూ మనస్ఫూర్తిగా వేడుకను చూడాలని, ఫోన్లను పక్కన పెట్టాలని కోరారు. ఇది ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. విభిన్న సంస్కృతులు కలిసినప్పుడు వచ్చే అందమే వేరు. విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక సంప్రదాయాలను గౌరవిస్తూ కొడవ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం చూస్తుంటే, ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం అర్థమవుతుంది. దేశ ప్రధాన మంత్రి మోదీ సైతం ఈ వివాహాన్ని విభిన్న సంస్కృతుల కలయికగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలపడం ఈ పెళ్లి ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఏది ఏమైనా, వీరిద్దరి వివాహం కేవలం ఒక వేడుకగానే కాకుండా, భారతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా నిలిచింది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×