E-Paper
Advertisement

ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!

ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!
Advertisement

Sangareddy: స్వేచ్ఛ బ్యూరో: సంగారెడ్డి పట్టణం లోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంగళవారం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తో పాటు జహీరాబాద్ ఎంపి సురేష్ షెట్కార్ , మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, పఠాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

కార్యకర్తలకు సముచిత స్థానం

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం, పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇంకా నాయకుల మధ్య సమన్వయం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాల ను చేపట్టినా, ఆ సందేశాన్ని, స్ఫూర్తి ని ప్రజల్లోకి తీసుకెళ్ళా ల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల పైనే ఉంటుందన్నారు. కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలని సూచించారు.

డెబ్భై వేల ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటినుండే సన్నద్ధం కావాలి, పార్టీ నాయకుల మధ్య వర్గ పోరు ఉండొద్ద న్నారు. నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండటం సహజమే.. కానీ వర్గ పోరు వల్ల పార్టీ కి నష్టం జరుగుతుందన్నారు. డెబ్భై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పటివరకు కేవలం ఆరోగ్య శాఖ లోనే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు.లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ను రైతు బంధు రూపం లో రైతులకు అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని గ్రామగ్రామాన విజయవంతంగా అమలవుతోందన్నారు . నలబై ఆరు లక్షల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేపట్టామని, దేశం లో ఎక్కడా లేనివిధంగా దిజిటల్ హెల్త్ కార్డ్ లు అందించేందుకు కృషి చేస్తున్నా మని తెలిపారు. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ ఆసుపత్రులలో మరో 50 పడకలు అదనంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల లో భవిషత్తు లో పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నరు. సింగూరు ప్రాజెక్టు ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. 200 కోట్లతో సింగూరు ప్రాజెక్టు ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు.

Also read: మ‌హేశ్‌కు మంత్రి చాన్స్ లేన‌ట్టే! వైఎస్‌-డీఎస్ జోడీ హిస్ట‌రీ… రేవంత్‌-మ‌హేశ్‌తో రిపీట్ అవుతుందా?

సెపరేట్‌గా బిల్లు పెడితే..

Advertisement

విద్య, వైద్యం, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం ముందుకెళ్తోంది అని అన్నారు. మహిళా బిల్లు కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని సెపరేట్ గా బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. డీలిమిటేషన్ ఉన్నా లేకున్నా మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుునిచ్చారు. నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలిచాం, మన బలాబలాలు , లోపాల పై చర్చించుకోవాలి అన్నారు. వచ్చే ఎంపీ టీ సి , జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం లో చర్చ జరగాలన్నారు. మూడేళ్ల కు పైగా మండలస్థాయి లో పనిచేసిన వారికి, జిల్లా స్థాయి లో పదవులు ఇచ్చి, వారి స్థానం లో మండలం లో కొత్తవారిని నియమించాలని సూచించారు.

ఎంపి సురేష్ షెట్కార్ మాట్లాడుతూ..

ప్రభుత్వం ఉన్నది కాబట్టి అభ్యర్థుల ఎంపిక లో పోటీ ఉందని, మన మధ్యే మనకే పోటీ వల్ల పార్టీ కి నష్ట జరుగుతుందన్నారు.మొన్న పార్లమెంట్ లో జరిగిన పరిణామాల ను, ఎందుకు మహిళా బిల్లు ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందో , మహిళా బిల్లు విషయం లో బీజేపీ కుట్ర లను సైతం పార్టీ పరంగా చర్చ జరగాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జహీరాబాద్ ఎంపి సురేష్ షెట్కార్ మాట్లాడుతూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 70% మంది సర్పంచ్ లు గా గెలిచారన్నారు. నాయకుల మధ్య సమన్వయం ఉం డాలి, అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం తో పని చేయా లని పిలుపునిచ్చారు. దేశం లో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సన్న బియ్యం, ఇందిరమ్మ గృహ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో..

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం రైతు బంధు ను కొనసాగిస్తుంది అని వివరించారు. రాష్ట్రం లో ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుందన్నారు.వచ్చే ఎన్నికల్లో నూ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని తెలిపారు. నీలం మధు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రం లో జరిగిన కుల గణన ఆధారంగా వచ్చే ఎన్నికల్లో అన్ని కులాల కు సమ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతా పాటిల్, పిసీసి ప్రధాన కార్యదర్శులు తోపాజి అనంత్ కిషన్, చిన్నా ముదిరాజ్, నాయకులు శశికళా యాదవ్ రెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారయణ, కొహీర్, జోగిపేట మున్సిపల్ చైర్మన్ లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read: గులాబీ గూటిలో కుంపట్లు.. కవిత ‘పంచ్’లు.. కేసీఆర్ ‘సైలెన్స్’.. పార్టీ పరిస్థితి ఏంటి?

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×