TVK Maanadu : వయసు అయిపోయిన సినిమా హీరోలంతా రాజకీయ నాయకుల అయిపోయినట్లు అని త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాస్తాడు. అయితే సినిమా కెరియర్ ఎండ్ అవ్వకుండా శిఖర స్థాయిలో ఉన్నప్పుడే తెలుగులో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అదే మాదిరిగా ఇలయ దళపతి విజయ్ తమిళ్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళ వెట్రి కలగం అనే పేరుతో పార్టీని స్థాపించాడు విజయ్. విజయ్ పెట్టిన ఈ పార్టీకి భారీ రెస్పాన్స్ వస్తుంది.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద ఫస్ట్ లో చాలా సెటైర్లు వచ్చాయి. కానీ విజయ్ పెట్టిన సభలకు వచ్చిన ప్రజలను చూస్తుంటే అందరికీ మైండ్ పోతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి, స్టార్ హీరో కి రాని జనాలు విజయ్ సభలకు హాజరవుతున్నారు. విజయ్ సభలకు వస్తున్న ప్రజలు ఓట్లేస్తే విజయ్ గెలవడం ఖాయం అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పొలిటికల్ బోణి అదిరింది
మామూలుగా సినిమా నటులను చూడడానికి విపరీతంగా అభిమానులు వస్తూనే ఉంటారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా విజయ్ సభలకు చాలామంది ప్రజలు కూడా వస్తున్నారు. మొన్న జరిగిన మానాడు సభ అయితే విపరీతంగా పాపులర్ అయింది. విజయ్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. మొన్న జరిగిన మానాడు సభకు 4 లక్షలకు పైగా వచ్చిన జనాలను తన ఫోన్ తో సెల్ఫీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి 8.6 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఏకంగా 86 లక్షల మంది విజయ్ పోస్ట్ లేని లైక్ చేశారు అంటే అది మామూలు విషయం కాదు. అయితే పోస్ట్ చూసి లైక్ చేయని వాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారు మన ఊహకి కూడా అందదు.
ఆకట్టుకున్న విజయ్ స్పీచ్
ఇక విజయ్ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత ఒక స్మాల్ సప్రైజ్ అంటూ తన స్పీచ్ మొదలుపెట్టాడు. మధురై నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా అంటూ విజయ్ తన పేరు అని చెప్పాడు. ఆగండి అక్కడితో అయిపోలేదు అని తమిళనాడులో ఉన్న కొన్ని రాష్ట్రాల పేర్లు చెబుతూ అన్ని రాష్ట్రాల్లోని కూడా పోటీ చేసేది విజయ్ అంటూ చెప్పాడు. ఎవరికి అర్థం కాలేదా అక్కడ మన పార్టీ తరపున ఎవరు నిల్చున్నా మీరు ఓటేసేది మాత్రం విజయ్ కు అనుకొని ఓటు వేయండి. నేను సింగల్ గా పోటీ చేస్తున్నాను, ఇది డిస్క్రిప్షన్ కాదు డిక్లరేషన్ అంటూ విజయ్ ఆరోజు మాట్లాడిన మాటలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడు ప్రజలు విజయ్ కు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు అందిస్తారో చూడాలి