Vijay: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో, తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో విజయ్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. విజయ్ తండ్రి దర్శకుడుగా ఎన్నో హిట్ సినిమాలు చేశారు. విజయ్ కెరియర్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయ్. ఆ తర్వాత మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.
తుపాకీ సినిమాను ఏఆర్ మురగదాస్ తెరకెక్కించారు. ఏ ఆర్ మురగదాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ అనే సినిమాను తీసింది మురగదాస్. మురగదాస్ విజయ్ కాంత్ హీరోగా రమణ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ చేశారు. విజయ్ హీరోగా తుపాకీ సినిమా తర్వాత కత్తి అనే సినిమా చేశాడు మురగదాస్. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సర్కార్ సినిమా వచ్చింది.
అడిగిమరీ పొలిటికల్ సినిమా
మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తి సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కోసం ఈ సినిమానే రీమేక్ చేయాల్సి వచ్చింది. మురగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన మూడవ సినిమా సర్కార్. ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా. మొదట ఈ కథ అనుకోలేదు మురగదాస్. కత్తి సినిమా తర్వాత ఒక డ్రై ఫిలిం ప్లాన్ చేశారు. ఇది ఒక ట్రావెల్ స్టోరీ శ్రీలంక నుంచి ఇండియా ,థాయిలాండ్, కెనడా ,లండన్ వంటి దేశాలను లుంగీ మరియు షర్టుతో తిరిగే యాక్షన్ మోడ్ ఫిలిం. కానీ ఎటువంటి ఫైటు లేకుండా ఉంటుంది. ఆ తరుణంలో విజయ్ పొలిటికల్ సినిమా అడగడంతో సర్కార్ సినిమా చేయాల్సి వచ్చింది.
ముందు నుంచే రాజకీయ వ్యూహం
ఆడియన్స్ మీద సినిమాలు ప్రభావం పడుతుంది అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఎప్పుడు నుంచో జరుగుతూ వస్తుంది. అయితే విజయ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నారు. అందరికీ తెలుసు. ఇప్పుడు తమిళ రాజకీయాల్ని తెలుగు ప్రేక్షకులు కూడా పరిశీలించడం మొదలుపెట్టారు. ఇలా రాజకీయ రంగ ప్రవేశానికి కూడా తన ఫిల్మోగ్రఫీ ఉపయోగపడాలి అని వ్యూహంతోనే విజయ్ మురగదాస్ ను ఒక పొలిటికల్ సినిమా అడిగి ఉండొచ్చు.
Also Read : Pawan Kalyan: ఓజి సినిమాతో పాటు, ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్. కాంపిటీషన్ కాదు సెలబ్రేషన్