Fish Venkat Emotional: టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని బోడుప్పల్ RBM హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఈయన కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు. ఈయన తన రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిన నేపథ్యంలో వెంటిలేటర్ పై ఉంచి ఈయనకు చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని తెలుస్తోంది. మొదటి రోజు ఎవరిని గుర్తుపట్టలేని విధంగా స్పృహ లేకుండా పడి ఉన్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం పైకి లేచి ఇతరులతో మాట్లాడే స్థితికి వచ్చారని తెలుస్తుంది.
మెరుగుపడిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం..
ఈ క్రమంలోనే “బిగ్ టీవీ”(Bigg Tv) ఫిష్ వెంకట్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇతరుల సహాయంతో బెడ్ మీద నుంచి పైకి లేచిన ఫిష్ వెంకట్ మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగుందని తనని చూడటానికి ఎమ్మెల్యేలు ,తన స్నేహితులు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి కాస్త మెరుగుపడటంతో సహాయం చేయాలి అంటూ అభ్యర్థించారు. ఇలా ఫిష్ వెంకట్ లేచి స్వయంగా మీడియాతో మాట్లాడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక డాక్టర్లు కూడా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు మొదటి రోజుతో పోలిస్తే ఇప్పుడు కోలుకుంటున్నారని తెలిపారు. ఈరోజు కూడా తనకు డయాలసిస్ చేసినట్టు డాక్టర్లు తెలిపారు.
ఫిష్ వెంకట్ కు అండగా తెలంగాణ ప్రభుత్వం..
తన పరిస్థితి కాస్త మెరుగుపడితే మరొక రెండు మూడు రోజులలో డిస్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని డాక్టర్స్ తెలియచేశారు. ఇకపోతే ఫిష్ వెంకట్ పరిస్థితి చూసి సహాయం చేయాలి అంటూ తన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. తమకు కాకుండా సహాయం చేసేవారు డబ్బును నేరుగా హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. అయితే ఇప్పటివరకు పర్సనల్ గా హాస్పిటల్ కంటూ ఎలాంటి డొనేషన్స్ రాలేదని డాక్టర్స్ తెలిపారు. ఇక మేము కూడా హాస్పిటల్ బిల్లులో 50% తగ్గించే చెబుతున్నామని తెలిపారు. ఈ విధంగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని స్వయంగా మంత్రులు వెళ్లి పరామర్శించడమే కాకుండా ఆయన చికిత్సకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇలా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన కూడా ఇప్పటివరకు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఇక ఫిష్ వెంకట్ కాస్త కోలుకొని సహాయం చేయమని అభ్యర్థిస్తున్నారు ఇప్పటికైనా టాలీవుడ్ మనసు కరిగేనా? వెంకట్ కు అండగా నిలిచేనా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. గత వారం రోజులుగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి మీడియా వార్తలలోనూ సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తున్న ఇప్పటివరకు సినీ పెద్దలు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈయన సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.
Also Read: War 2 Movie: వార్ 2 షూటింగ్ పూర్తి… హృతిక్ రోషన్ పై తారక్ సెన్సేషనల్ ట్వీట్!