E-Paper
Advertisement

‘అంజి’ కష్టాలు రిపీట్ అవుతున్నాయా..? ‘విశ్వంభర’ లేటెస్ట్ లీక్స్‌తో తలపట్టుకుంటున్న ఫ్యాన్స్!

‘అంజి’ కష్టాలు రిపీట్ అవుతున్నాయా..? ‘విశ్వంభర’ లేటెస్ట్ లీక్స్‌తో తలపట్టుకుంటున్న ఫ్యాన్స్!
Advertisement

Vishwambhara Delays: విశ్వంభర…ఈ సినిమాని చిరు ఏ ముహూర్తాన మొదలెట్టాడో కాని..మూడు అడుగులు ముందుకు పడితే ముప్పయ్ అడుగులు వెనక్కి అన్నట్టు ఉంది దీని పరిస్థితి.దీని తర్వాత సెట్స్ మీదకి వెళ్ళిన సినిమాలు సూపర్ హిట్ అయిపోవడం,వందల కోట్ల కలెక్షన్స్ కొట్టడం జరిగిపోతున్నాయ్, కాని వశిష్ట దర్శకత్వం వహించినఈ సినిమా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

నిజానికి ఈ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ ,విజువల్ వండర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎంతలేదన్నా రిలీజ్ ఏడాది పైన పడుతుందేమో అనుకున్నారు.కానీ రెండేళ్ళు గడిచినా అతీగతీ లేకుండా పోయింది.ప్రస్తుతం సినిమా వాలకం చూస్తుంటే ముచ్చటగా మూడేళ్ళు కంప్లీట్ చేసుకునేలానే కనిపిస్తుంది.కారణం సినిమా ఇపుడు రీ షూట్స్ బాట పట్టడమే.

సాటిస్ ఫ్యాక్షన్ ఇవ్వని సీన్స్ 

Advertisement

అవును …విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తొలిసారిగా వదిలిన గ్లిప్మ్స్ ట్రోలర్స్ కి ఎలాంటి మీమ్స్ స్టఫ్ గా మారాయో చెప్పక్కర్లేదు. చిరు లాంటి మెగా హీరో ,భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా నుండి ఇలాంటి నాసిరకమైన గ్లిమ్ప్స్ రావడమేంటని ఒక రేంజ్ లో చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు. ఇక అప్పటి నుండి సినిమా క్వాలిటీపై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పకడ్బందీగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులని చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ వశిష్ట.ఇక చిరు రీసెంట్ గా మాట్లాడుతూ ఈ ఏడాది సమ్మర్ లోనే వచ్చే చాన్స్ ఉంది అని ఊరించినా విశంభరుడు మాత్రం అంత ఈజీగా థియేటర్లలోకి అడుగుపెట్టలేకపోయాడు.ఇక తాజాగా సినిమాలోని కొన్ని సీన్స్ అంతగా సాటిస్ ఫ్యాక్షన్ ఇవ్వలేదని, అందుకోసం ఆ సీన్స్ ని మళ్ళీ రీషూట్ చేయాలని ఆలోచిస్తుందట మూవీ టీమ్.

ఇప్పట్లో థియేటర్ లలోకి రావడం చాలా కష్టం

వాస్తవానికి ఏ సినిమా అయినా 100 పర్సెంట్ సాటిస్ ఫాక్షన్ ఇవ్వాలంటే చాలా కష్టం.ఇపుడు అదే పర్ఫెక్షన్ కోసం మేకర్స్ మళ్ళీ కొత్తగా రీషూట్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారికే తెలియాలి. పైగా చిరు ఇపుడు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 సినిమా షూటింగ్ లో తెగ బిజీగా ఉన్నాడు .ఇలాంటి ఈ సమయంలో ఎప్పుడో ముగిసిపోయిన ఈ సినిమాకి మళ్ళీ డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తాడో చూడాలి.ఇక ఈ రీ షూట్ అన్న టాక్ వినపడగానే ఇక ఈ సినిమాకి అంజి కష్టాలు రిపీట్ అవుతున్నాయ్ గా అంటూ తలలు పట్టేసుకుంటున్నారు మూవీ లవర్స్.

వచ్చే ఏడుకి పోస్ట్ పోన్ చేసుకుపోతాడా

Advertisement

ఏది ఏమైనా జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ స్థాయిలో చిరు మరో సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడని కాలర్ ఎగరేసిన మెగా ఫ్యాన్స్ ని ఈ విశ్వంభర చేస్తున్న డిసప్పాయింట్ అంతా ఇంతా కాదు.చూడాలి మరి ఇప్పటికైనా అభిమానుల ఆవేదనని అర్థం చేసుకుని వశిష్ట సినిమాని త్వరగానే థియేటర్ లోకి వదులుతాడా లేక అబ్బే ఇప్పట్లో కష్టం అంటూ వచ్చే ఏడుకి పోస్ట్ పోన్ చేసుకుపోతాడా !

Related News

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

Big Stories

Advertisement
×