E-Paper
Advertisement

తెలంగాణలో ‘బెంగాల్’ స్కెచ్ సాగదు.. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

తెలంగాణలో ‘బెంగాల్’ స్కెచ్ సాగదు.. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!
Advertisement

Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు, బీజేపీ వ్యూహాలు, అలాగే యాదగిరిగుట్ట బోర్డు నియామకాలపై రేగిన వివాదంపై ఆయన ఘాటుగా స్పందించారు. స్థానిక వేదికగా ఆయన మాట్లాడిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఓట్ల దొంగతనంతో గెలవలేరు!

Advertisement

పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా ఓట్లు దొంగిలించి, అడ్డదారిలో గెలవాలని చూస్తే ఇక్కడ సాధ్యం కాదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ.. ఇక్కడ కేవలం కులమతాల పేరిట చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే కొందరికి ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు గుర్తొస్తాయని, కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు.

Also Read: ‘గొడ్డలి పార్టీ’ని తరిమికొట్టండి.. నెల్లూరు వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Advertisement

బీజేపీ – బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కానీ, అయోధ్యకు సంబంధించిన స్కామ్‌లపై కానీ బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. ఈ మౌనం చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న అంతర్గత అవగాహన (మ్యాచింగ్ ఫిక్సింగ్) స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి కనీసం రెండు సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.

నితిన్ నబీన్ వ్యాఖ్యలకు కౌంటర్

తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామంటూ బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచినంత మాత్రాన ప్రతిసారీ అదే రిపీట్ కాదని, ఈసారి కనీసం రెండు సీట్లు కూడా దక్కవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక భయపడుతున్నాయని, ప్రజలు కాంగ్రెస్‌ను మాత్రమే నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

యాదాద్రి బోర్డు వివాదంపై వివరణ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డులో కొణిదెల సురేఖ నియామకంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డులో తెలంగాణ వాళ్లకు స్థానం దక్కినప్పుడు లేని అభ్యంతరం.. ఇక్కడ వస్తే ఎందుకు అని ప్రశ్నించారు. అయితే, యాదాద్రి ట్రస్టు సభ్యుల ఎంపిక విషయంలో స్థానిక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. బోర్డు సభ్యుల ఎంపికకు ముందు స్థానిక ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిని సంప్రదించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేశారు.

Related News

ఒకటి రెడ్డి.. మరొకటి బీసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..11 కేవీ కనెక్షన్లపై సరికొత్త నిబంధనలు!

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!

రాహుల్ కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా మోడీని ఏమీ చేయలేరు: ఈటల రాజేందర్

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

Big Stories

Advertisement
×