BigTV English

Amangal: మార్వాడీలపై స్థానిక వ్యాపారులు గరంగరం.. సోమవారం బంద్, అదే కారణమా?

Amangal: మార్వాడీలపై స్థానిక వ్యాపారులు గరంగరం.. సోమవారం బంద్,  అదే కారణమా?

Amangal: తెలంగాణ‌లో మ‌రో ఉద్యమం రానుందా? సోష‌ల్ మీడియాలో ఎందుకు పెద్దఎత్తున ట్రెండ్ అవుతోంది? తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ నినాదాల వెనుక అసలు ఉన్నదెవరు? మార్వాడీ షాపుల్లో స్థానికులు వస్తువులు కొనుగోలు చేయకూడదని ఎందుకు డిసైడ్ అయ్యారు? మార్వాడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం వ్యవహారం జఠిలమవుతోంది. ఈ యవ్వారంలో రాజకీయ నేతలు ఎంటరయ్యారు. గో బ్యాక్ మార్వాడీ అంటూ సోష‌ల్ మీడియాలో భారీగా నినాదాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్వాడీల పెత్తనం క్రమంగా పెరుగుతుందనే ఆరోపణలు లేకపోలేదు. స్థానికులు ఎవ్వరు మార్వాడీ షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దనే డిమాండ్ జోరందుకుంటోంది.

ఆమన్‌గల్‌లో అసలేం జరుగుతోంది? మార్వాడీలు చాలామంది ఆ ప్రాంతంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. వారి దగ్గర పని చేసేందుకు వారికి సంబంధించిన వాళ్లని సొంత రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల స్థానికంగా ఉండేవారికి ఉపాది పోతోందనేది ప్రధాన ఆరోపణ.


మార్వాడీకి చెందిన హోల్ సేల్ వ్యాపారులు స్థానిక షాపుల వారికి ఎక్కువ రేటుకు వస్తువులను అమ్ముతున్నారట. అదే మార్వాడీ షాపుల వారికి తక్కువ ధరకు వస్తువులను అమ్ముతున్నారని అంటున్నారు. ఇలాంటి ఎత్తుల వల్ల స్థానికంగా ఉండే చిన్న చిన్న వ్యాపారులు కుదేలు అయ్యే పరిస్థితి చేరుకుంది.

ALSO READ: ఆపరేషన్ కరీంనగర్.. మేయర్ సీటు కోసం సీఎం రేవంత్ నయా ప్లాన్

గతంలో మార్వాడీలు బంగారం, కిరాణా హోల్‌సేల్, స్వీట్ షాపుల వ్యాపారాలు చేసేవారు. అన్ని వ్యాపారాల్లో ఎంట్రీ కావడంతో స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అంటున్నారు.  ఈ క్రమంలో ఈనెల 18న అంటే సోమవారం స్థానిక వ్యాపారులు.. మార్వాడీలకు వ్యతిరేకంగా ఆమన్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చారు.

మార్వాడీలకు మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్ నిలిచారు. కొంతమంది కమ్యూనిస్టులు ముసుగులో ఆ జెండా పట్టుకుని కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ఆడుగున్న నాటకంగా వర్ణించారు.  మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, వారంతా బీజేపీకి అనుకూలంగా ఉంటారని భావించి ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ సంపదను దోచుకోవడానికి రాలేదని, అధికారం కోసం అస్సలు రాలేదన్నారు. వాళ్ల వ్యాపారాల వల్ల తెలంగాణ జీడీపీ పెరిగిందన్నారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉందని కుండబద్దలు కొట్టేశారు. తెలంగాణకు చెందినవారు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నారని  గుర్తు చేశారు.

రోహింగ్యాలు అనేక మంది వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నారని, వాళ్ల గురించి మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారివల్ల హైదరాబాద్ ISI కి అడ్డాగా మారిందన్నారు. అనేక ఘటనలు జరిగాయని, నివేదికలు వస్తున్నాయని అన్నారు. వాళ్లకు బీఆర్ఎస్ షెల్టర్ ఇచ్చిందన్నారు. వారి వల్ల ప్రమాదం పొంచివుందని, ఎప్పుడైనా ఇబ్బందులు రావచ్చన్నారు. సోమవారం బంద్‌పై అందరి చూపు పడింది.

 

 

Related News

Medigadda: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం..

Karimnagar: ఆపరేషన్ కరీంనగర్.. మేయర్ సీటు కోసం రేవంత్ నయా ప్లాన్!

Heavy Rains: నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. బయటకు వెళ్లొద్దు

Telangana rain alert: సంగారెడ్డి, మెదక్‌లో కుండపోత వాన… హైదరాబాద్ లోనూ భారీ వర్షం!

Karimnagar news: వృద్ధాప్య పెన్షన్ పంపకంలో తేడా.. తల్లిని వదిలేసిన కుమారులు.. చివరికి?

Big Stories

×