Tollywood: రోజూరోజూకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు సినిమా రంగంలో కొన్ని సీన్స్ తీయడానికి మేకర్స్ చాలా కష్టపడే వాళ్ళు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక అసలు టెక్నీషియన్స్ కూడా అవసరం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది ఏఐ. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన మనుషులు తిరిగి వస్తున్నారు. ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్న మనుషులను కళ్ళముందుకు తీసుకొస్తున్నారు.
అంతేకాకుండా తమకు నచ్చిన హీరోలు ఎలా ఉండాలి అనేది వారంతట వారే ఉహించుకొని దానికి తగ్గట్లు కూడా ఈ ఏఐ టెక్నాలజీతో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. హీరోలు- హీరోయిన్లకు కొత్త కథలు సృష్టిస్తూ కొత్త కొత్త సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యనే పుష్ప2 అల్లు అర్జున్ కాకుండా మహేష్ బాబు చేస్తే ఎలా ఉంటుందో అని ఏఐ వీడియో ద్వారా ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు ఒక అభిమాని.. అది కాస్త వైరల్ గా మారడం తెలిసిందే. దీంతో అభిమానులు అస్సలు తగ్గలేదు అంటూ తమకు నచ్చిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. హీరోలు లావైతే ఎలా ఉంటారు..? హీరోయిన్స్ లావైతే ఎలా ఉంటారు..? హీరో హీరోయిన్లు చిన్నప్పుడు ఎలా ఉండేవారు..? వేరే హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారు..? ఇలా ప్రతి దానిని ఏఐ వీడియో ద్వారా నిజరూపంలోకి తీసుకొస్తున్నారు.
Amitabh Bachchan: ఐశ్వర్య రాయ్ ను ఎప్పుడూ పొగడరెందుకు.. అమితాబ్ ఆన్సర్ హైలైట్
తాజాగా ఇలాంటి ఒక ఏఐ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో ఏమున్నదంటే మన స్టార్ హీరోలు కనుక సామాన్యులుగా బ్రతికితే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించారు. మహేష్ బాబు, నాని, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ స్టార్ హీరోలు సామాన్యులు గా మారి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనే విధంగా ఒక ఏఐ వీడియోను క్రియేట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ మటన్ కొట్టే మస్తాన్ లాగా మటన్ కొడుతూ కనిపించాడు. ఇంకోపక్క అల్లు అర్జున్ జొమాటో డెలివరీ బాయ్ గా కనిపించినా.. వీరు మాత్రమే కాకుండా ప్రభాస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర చికెన్ కాలుస్తున్నట్లు, రామ్ చరణ్ ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టుకున్నట్లు చూపించారు. ఇక నాని టీ కొట్టు పెట్టుకున్నట్లు చూపించారు.
నిజం చెప్పాలంటే ఇది ఏఐ వీడియోలా అది కనిపించలేదు. నిజంగానే స్టార్ హీరోలు సామాన్యులుగా మారితే ఇలాగే ఉంటారేమో అని ఇంతగా ఆ వీడియో ఉంది. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ వైరల్ గా మార్చారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఆ పనులకు బాగా సెట్ అయ్యారని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుండా పోయింది. కొన్ని రోజులు ఆగితే ఏఐ ద్వారానే సినిమాలు కూడా తెరకెక్కిస్తారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ టెక్నాలజీ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==