Indian Team Captains: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండా.. కొత్త కెప్టెన్, యువ ఆటగాళ్లతో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన టీం ఇండియాకు లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లోనే షాక్ తగిలింది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లోనే ఐదు వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగుల ఆదిక్యం సాధించినా.. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఐదుగురు భారత బ్యాటర్లు సెంచరీలు చేసినా.. టీం ఇండియాకి ఓటమి తప్పలేదు.
Also Read: Esha Gupta – Hardik: మరో హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా పెళ్లి… వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్
371 పరుగుల టార్గెట్ ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు.. మంగళవారం రోజు రాత్రి ఐదు వికెట్ల తేడాతో తొలి టెస్ట్ లో భారత్ ని ఓడించింది. ఇంగ్లాండ్ అద్భుత చేజింగ్ వల్ల గిల్ నాయకత్వంలోని జట్టు ఓటమిని మూటగట్టుకుంది. కెప్టెన్ గా ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించినప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గిల్ కి విరాట్ కోహ్లీ దరిద్రం పట్టుకుందని.. ఇక టీమిండియా వరుసగా ఓడిపోవడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఇంగ్లాండ్ పై గిల్ సెంచరీ సాధించినప్పటికీ.. జట్టు ఓటమిని చవిచూసింది. సరిగ్గా ఇలాగే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు తొలి టెస్ట్ ఆస్ట్రేలియా తో జరిగింది. 2014లో కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా పై 115 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు గిల్ కూడా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి సెంచరీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. భారత్ పై ఇంగ్లాండ్ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల విషయానికి వస్తే.. 2008లో అనిల్ కుంబ్లే స్థానంలో ధోని టెస్ట్ ఫార్మాట్ లో భారత్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. తన సారథ్యంలో ధోని మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టును 8 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తన తొలి మ్యాచ్ లోనే భారత జట్టును విజయపథం వైపు నడిపించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 222 పరుగులు తేడాతో గెలుపొందింది. ఇలా రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని.. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి తొలి మ్యాచ్ లోనే భారత్ ని విజేతగా నిలిపారు.
Also Read: Shubman Gill: ఓటమిపై గిల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ దరిద్రుల వల్లే ఓడిపోయాం..!
కానీ విరాట్ కోహ్లీ, గిల్ మాత్రం నిరాశపరిచారు. ఇలా గిల్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ గిల్ కి కాస్త సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.” కెప్టెన్ గా గిల్ కి ఇది మొదటి టెస్ట్. సహజంగానే గిల్ కి కొంత నర్వస్ గా ఉండొచ్చు. టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేయడం చాలా గొప్ప గౌరవం. గిల్ ప్రదర్శన అద్భుతం. తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ చేసి అతను ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడే అతనిపై నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు. అతడిలో మంచి కెప్టెన్ కావడానికి కావలసిన అన్నీ ఉన్నాయి. అందువల్ల అతడికి ఇంకా సమయం ఇవ్వాలి” అని చెప్పుకొచ్చాడు గంభీర్.