BigTV English

Amitabh Bachchan: ఐశ్వర్య రాయ్ ను ఎప్పుడూ పొగడరెందుకు.. అమితాబ్ ఆన్సర్ హైలైట్

Amitabh Bachchan: ఐశ్వర్య రాయ్ ను ఎప్పుడూ పొగడరెందుకు.. అమితాబ్ ఆన్సర్ హైలైట్

Amitabh Bachchan: బాలీవుడ్ లోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం పెద్ద మిస్టరీగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అని ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ అంటే.. ఇంట్లోవారికి అస్సలు పడదని, ఎప్పుడూ కూడా అత్తామామలు ఐశ్వర్యను ప్రేమగా చూసుకోలేదని చెప్పుకొస్తారు. ఇంకా చెప్పాలంటే ఏరోజు కూడా అత్త జయాబచ్చన్ పక్కన కోడలు ఐశ్వర్య నవ్వుతూ నిలబడిన దాఖలాలు లేవు. సాధారణంగా ఒక స్టార్ హీరోయిన్ ను ఇంటికి కోడలిగా తెచ్చుకుంటే ఆ మామ కోడలి గురించి మీడియా ముందు ఏ రేంజ్ లో పొగుడుతాడో అందరికీ తెల్సిందే.


నాగార్జున.. సమంత గురించి మీడియా ముందు నా కోడలు గొప్ప అని ఒప్పుకున్నాడు. ఇక చిరు.. ఉపాసన హీరోయిన్ కాకపోయినా కూడా ఆమె గొప్పతనం గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అలా ప్రతి ఒక్క హీరో.. తన కొడుకు – కోడలి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొస్తారు. కానీ, బిగ్ బి మాత్రం  ఏ రోజు కూడా ఐశ్వర్య గురించి పొగడడం పక్కన పెడితే ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కానీ, కొడుకు అభిషేక్ బచ్చన్ గురించి మాత్రం ఆపుకోకుండా మాట్లాడతాడు.

ఇండస్ట్రీలో తండ్రి వారసత్వాన్ని అందుకొని వచ్చిన వారసులు.. తండ్రిని మించిన తనయులుగా మారారు. కానీ, అభిషేక్ మాత్రం ఇంకా తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతున్నాడు. అమితాబ్ ను దాటుకొని బయటకు రావాలి అన్న ప్రతిసారి అతనికి నిరాశనే ఎదురయ్యింది. మంచి మంచి కథలను ఎంచుకున్నా కూడా అభిషేక్ కు స్టార్ హీరో స్టేటస్ దక్కలేదు. అయినా కూడా ఏరోజు కూడా అమితాబ్, అభిషేక్ ను పక్కన పెట్టలేదు. ఎప్పుడు కూడా అభిషేక్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. అభిషేక్ ఇండస్ట్రీలో ఎదగలేకపోవచ్చు కానీ, అతను ఎంతో మంచి కొడుకు అని అమితాబ్ కితాబు ఇచ్చాడు.


Sudigali Sudheer: బతికుండగానే నా తండ్రిని చంపారు.. సుధీర్ చీకటి కోణంలో బయటపడ్డ నిజాలు

ఇక ఇవన్నీ పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్.. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడు. ఇక అందులో ఒక అభిమాని.. మీరెందుకు ఎప్పుడు కొడుకు అభిషేక్ నే పొగుడుతారు..? కోడలు ఐశ్వర్యను ఎందుకు పొగడరు.. ? అన్న ప్రశ్నకు అమితాబ్ సమాధామిస్తూ ” అవును.. నేను ఎప్పుడు అభిషేక్ ను పొగుడుతాను. అది వాస్తవమే. నా కొడుకు అభిషేక్ కు అందరిపైనా ప్రేమ, గౌరవం ఎక్కువ చూపిస్తాడు.

నేను అభిషేక్ తో పాటు నా భార్య జయ బచ్చన్ ను, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను కూడా పొగుడుతాను. కానీ, అది నేను మనసులోనే చేస్తాను. మహిళలంటే తనకు గౌరవం అలా చూపిస్తాను” అని చెప్పుకొచ్చాడు. అయితే అమితాబ్ వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కొడుకు గురించి గొప్పగా అందరిముందు చెప్పి, కోడలి గురించి మీ మనసులోనే అనుకోవడం ఏంటి విడ్డూరం కాకపోతే అని పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Janhvi Kapoor: తడిచీరలో దేవర బ్యూటీ అందాల విందు.. పరమ్ సుందరి రెయిన్ సాంగ్ చూశారా ..?

Kaantha: దుల్కర్- భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూశారా.. ఇదేదో బాగా వర్క్ అవుట్ అయ్యేలానే ఉందే

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

War2 Pre Release: వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం… ఎప్పుడు.. ఎక్కడంటే?

Nagarjuna: కూలీ సినిమాతో పాటు ఆ బ్లాక్ బస్టర్ సినిమా ట్రైలర్, నాగార్జున మామూలు ప్లానింగ్ కాదు.

Aishwarya Rai: అత్యంత ధనవంతురాలిగా 2వ స్థానం.. ఐశ్వర్య ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?

Big Stories

×