Telangana BJP: తెలంగాణ బిజెపీ లో షోకాస్ నోటీసులు ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. షోకాస్ నోటీసులు పంచాయతీ బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరింది. బిజెపి రాష్ట్ర అధ్యక్ష జిల్లా పర్యటనలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అధ్యక్షుడి ముందే బాహా బాహీకి దిగుతున్న జిల్లా నేతలను కంట్రోల్ చేసే పనిలో పడింది రాష్ట్ర నాయకత్వం. ఆ క్రమంలో నోటీసులు ఇచ్చి వివరం తీసుకునే తెలిసే ప్రక్రియకు తెరలేపారు. అలా బిజెపీలో గుట్టు చప్పుడు కాకుండా షోకాస్ నోటీసులు ఇచ్చేసి వివరణలు తీసుకోవటం పార్టీలో తీవ్ర చర్చనియాంశంగా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో నేతల బాహాబాహీకి దిగుతున్న నేతలు
తెలంగాణ కాషాయ పార్టీలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. ఆఖరికి కొత్త రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలోనే జిల్లా పార్టీ నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. ఈ పరిస్థితి చినికి చినికి గాలివానగా మారేలా పరిస్థితి దాపురించిందనే టాక్ నేతల మధ్య నడుస్తోందట. అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలోనే నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడడంతో పార్టీలో చర్చనీయ అంశంగా మారిందట.
వర్గపోరును కట్టడి చేసేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం
రాష్ట్ర బిజెపీ చీఫ్ పర్యటనలో బయటపడ్డ వర్గపోరును కట్టడి చేసేందుకు పార్టీ నాయకత్వం నడుము బిగించిందట. వర్గపోరుకు కారణమవుతున్న నేతలకు మూడో కంటికి తెలియకుండా షోకాజ్ నోటీసులను పంపించిందట రాష్ట్ర బిజెపి నాయకత్వం. వారికి సంజాయిషి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి పలువూరు నేతలు హైదరాబాద్ లోని బీజెపీ రాష్ట్ర కార్యాలయానికి క్యూ కట్టారు. నాయకత్వం రాతపూర్వకంగా వారి వివరణ తీసుకుందట. అయితే ఈ ప్రక్రియ మొత్తం గుట్టు చప్పుడు కాకుండా చేపడుతూ ఉండడం గమనార్హం. కాగా వివరణ ఇచ్చేందుకు పలువురు నాయకులు కార్యకర్తలు స్టేట్ ఆఫీస్ కు క్యూ కట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది.
పార్టీలో రచ్చకెక్కుతున్న కమిటీ నియామకాల అంశం
కమలం పార్టీలో కమిటీల అంశంపై రచ్చకెక్కుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. శ్రేణుల్లో జోష్ నింపాలని భావించి ఆయన ఈ టూర్లు వేస్తున్నారు. ఎందుకంటే కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారికి ఈ టూర్లతో బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని భావించి ఆయన పర్యటనను కొనసాగిస్తూ ఉండగా పలు జిల్లాల్లో వర్గపోరు బహిర్గతమైంది. రామచంద్రరావు ఎదుటే బాహాబాహికి దిగుతున్నారు. సొంత పార్టీ అయి ఉండి ఒక వర్గం నాయకుడిపై మరో వర్గం నాయకులు విమర్శలు చేస్తూ ఉండడంతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంది. అందుకే దీనికి చెక్ పెట్టడంపై రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేసి నోటీసులు పంపి వారి వివరణ కోరినట్లు తెలుస్తుంది.
పెద్దపల్లిలో బహాబాహీకి దిగిన ప్రదీప్ రావు, రామకృష్ణారెడ్డి వర్గీయులు
బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్ళారు. అక్కడ దుగ్యాల ప్రదీప్ రావు గుజ్జుల రామకృష్ణ రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ బాహాబాహికి దిగారు. అలాగే మహబూబ్ నగర్ పర్యటనలోను రామచంద్ర రావుకు ఇదే తరహ అనుభవం ఎదురైంది. ఎంపిడికే అరుణకు వ్యతిరేకంగా సొంత పార్టీ వారు నినాదాలు చేశారు. దానికి తోడు కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపి ఈటల రాజేందర్ నడుమ వర్కపోరు. రంగారెడ్డి జిల్లా నేతలపై ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అసహనం నిజామాబాద్లో కమిటీల ఇష్యూ పై ఎంపి ధర్మపురి అరవింద్ అసహనం వ్యక్తం చేయడంతో సదరు వివాదాలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Also Read: తాడిపత్రి వైసీపీలో వార్.. పెద్దారెడ్డికి షాక్ తప్పదా?
నోటీసులు అందుకున్న పెద్దపల్లి బీజెపీ నాయకులు కార్యకర్తలు నాంపల్లిలోని బీజెపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి తమ వివరణను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆర్గనైజింగ్ సెక్రటరీలకు లిఖితపూర్వకంగా అందచేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన దాదాపు ఏడుగురికి ఈ నోటీసులు అందాయి. ఇదిలా ఉండగా పాలమూరు జిల్లా నాయకుడు పార్టీ రాష్ట్ర కోషాధికారి శాంతి కుమార్ సైతం ఇప్పటికే తన వివరణను రాష్ట్ర నాయకత్వానికి రాధపూర్వకంగా అందించినట్లు తెలిసింది. రాష్ట్ర కార్యాలయానికి పలు జిల్లాల పంచాయితీ చేయడంతో గుట్టు చప్పుడు కాకుండా నోటీసులు అందించిన అంశం బయటకు పొక్కింది. ఇంత సైలెంట్ గా షో కాజ్ నోటీసులు ఇచ్చి వారి వివరణ కోరడంతో పార్టీలో తీవ్ర చర్చనీయా అంశంగా మారింది. కాగా త్వరలో మరికొంతమందికి సైతం నోటీసులు అందించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Story By Ajay Kumar, Bigtv