BigTV English

Nayanthara : నయనతార, విగ్నేష్ శివన్ మధ్య ఏమి జరిగింది.? ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం

Nayanthara : నయనతార, విగ్నేష్ శివన్ మధ్య ఏమి జరిగింది.?  ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం

Nayanthara : నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకొని ఇక్కడ కూడా కొంతమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ అయిపోయింది. నయనతారకు ఎంత మంచి పేరు ఉందో, అదే స్థాయిలో కొద్దిపాటి కాంట్రవర్సీ లు కూడా ఉన్నాయి.


నయనతార హీరోయిన్ గా నేను రౌడీ దానే అనే సినిమాను తెరకెక్కించాడు విగ్నేష్ శివన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. విజయ్ సేతుపతి, నయనతార నటించిన ఈ సినిమా ఇప్పటికీ కూడా చాలామందికి ఫేవరెట్ ఫిలిమ్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి అది పెళ్లి వరకు దారితీసింది.

నయనతార విగ్నేష్ శివన్ మధ్య గొడవ 


కొన్ని సందర్భాలలో నయనతార ఇంస్టాగ్రామ్ పోస్టులు చూస్తుంటే అర్థం కాని పరిస్థితి. మళ్లీ వెంటనే వాటి గురించి రెస్పాండ్ అవుతూ క్లారిటీ కూడా ఇస్తుంది. అయితే వీళ్ళిద్దరూ సెట్స్ లో అరుచుకున్నారు. మాటకు మాట సమాధానం చెప్పుకున్నారు. ఇంతకు అదేంటి అంటే వీరిద్దరూ కలిసి హావెల్స్ అనే ఫ్యాన్ కి అడ్వర్టైజ్మెంట్ చేశారు.

ఈ అడ్వర్టైజ్మెంట్లో నయనతార డైరెక్టర్ గా నటించింది. విజ్ఞేశ్ శివన్ హీరోగా నటించిన. నయనతార మానిటర్ ముందు కూర్చుని ఆర్ట్ అంటూ గట్టిగా రావటం, అలానే కాస్ట్యూమ్స్ అంటూ గట్టిగా రావటం జరుగుతుంది. ఆ తరుణంలో విగ్నేష్ డైరెక్టర్ గారు షూటింగ్ చాలా రోజులు ఉంది ఎనర్జీని కంట్రోల్ చేయండి అంటూ అంటాడు. వెంటనే దానికి సమాధానంగా హీరో గారు షూటింగ్ చాలా రోజులు ఉంది కాబట్టి మీరు కూల్ అవ్వండి అంటుంది. అలానే వాయిస్ తో ఫ్యాన్ ని కంట్రోల్ చేస్తుంది. హావెల్స్ ఫ్యాన్ లో ఎటువంటి మోడల్స్ ఉన్నాయి అనేది ఈ యాడ్ యొక్క సారాంశం.

మెగాస్టార్ తో నయనతార 

నయనతార కి తెలుగులో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. చాలామంది స్టార్ హీరోలతో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన జతకట్టనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న 157 వ సినిమాలో నయనతార నటిస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విషయంలో అనిల్ రావిపూడి జాగ్రత్త వహించి పద్ధతిగా ఫాస్ట్ గా సినిమా షూటింగ్ జరుపుతున్నాడు.

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×