E-Paper
Advertisement

టాక్సిక్ కథ లీక్ చేసిన యశ్.. తండ్రి కొడుకుల రివేంజ్ స్టోరీనా?

టాక్సిక్ కథ లీక్ చేసిన యశ్.. తండ్రి కొడుకుల రివేంజ్ స్టోరీనా?
Advertisement

Yash Toxic Film: కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు యశ్(Yash) కే జి ఎఫ్ 2 విడుదలయ్యి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు యశ్ నుంచి తదుపరి సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈయన గీతు మోహన దాస్ దర్శకత్వంలో టాక్సిక్ (Toxic)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉందిగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మార్చి 19వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా యుద్ధం కారణంగా వాయిదా పడింది.

అయోమయంలో టాక్సిక్ విడుదల తేదీ..

ఇకపోతే ఈ సినిమా కొత్త విడుదల తేది గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ సమాచార ప్రకారం ఈ సినిమా జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. తాజాగా యశ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన టాక్సీక్ సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కథను కూడా లీక్ చేశారు.

స్మగ్లింగ్ నేపథ్యంలో..

Advertisement

టాక్సిక్ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ సినిమాగా  ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా కేవలం గ్యాంగ్ స్టర్ సినిమా మాత్రమే కాదని ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తండ్రి కొడుకుల మధ్య ఒక ప్రతీకార సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని యష్ తెలిపారు. అయితే రామాయణ సినిమాకు ఇది పూర్తిగా విభిన్నంగా ఉండబోతుందని తెలియజేశారు. గోవాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. సాధారణంగా గ్యాంగ్ స్టర్ సినిమాలు అంటే ముంబై లేదా కలకత్తా బ్యాక్ డ్రాప్  లో ఉంటాయి కానీ ఈ సినిమా చాలా విభిన్నంగా గోవా బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.

జూన్ 4న టాక్సిక్ విడుదల కానుందా?

Advertisement

ఇక ఈ సినిమాలో యష్ రాయ్ అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి, దిశా పటాని వంటి తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగానే ఈ సినిమా నాలుగో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందా లేదంటే మరింత ఆలస్యంగా విడుదల కానుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఏపీ సీఎంను కలిసిన బెల్లం కొండ ఫ్యామిలీ… శ్రీనివాస్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×