BigTV English

Yellamma: ఎల్లమ్మ.. మళ్లీ హీరో మారడమ్మా.

Yellamma: ఎల్లమ్మ.. మళ్లీ హీరో మారడమ్మా.

Yellamma: జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. ఇక  బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. వేణు కథను నమ్మి దిల్ రాజు.. తన కూతురుతో బలగం సినిమాను తెరకెక్కించేలా చేశాడు. అనుకున్నట్లే బలగం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుఅవార్డులను కూడా కైవసం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో వేణుకు గుర్తింపు వచ్చింది. ఓవర్ నైట్ వేణు స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.


ఇక బలగం లాంటి హిట్ సినిమా తరువాత వేణుకు స్టార్ హీరోల నుంచి పిలుపులు రావడం మొదలయ్యాయి. తన తదుపరి సినిమా బలగంకు మించి ఉండాలని ఆలోచించి వేణు.. ఎల్లమ్మ కథను రెడీ చేసుకున్నాడు. ఎల్లమ్మను కూడా దిల్ రాజునే నిర్మించడానికి సిద్దమయ్యాడు. ఇక మొదట ఎల్లమ్మ నాని వద్దకు చేరింది. కథ నచ్చి నాని కూడా ఈ సినిమాను ఓకే చేశాడు. పూర్తి స్క్రిప్ట్ తో వేణును తనవద్దకు రమ్మని చెప్పాడు.

నాని చెప్పినట్టే కొన్ని నెలలు కూర్చొని ఎల్లమ్మను రెడీ చేసి తీసుకెళ్తే నాని షాక్ ఇచ్చాడు. లైన్ నచ్చింది కానీ, ఫుల్ స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పాడు. దీంతో నాని పక్కకు తప్పుకున్నాడు. అయినా దిల్ రాజు ఆ కథను వదలలేదు. ఈసారి నితిన్ ని లైన్లో పెట్టాడు. ఎల్లమ్మ కథకు నితిన్ కూడా బాగా సెట్ అవుతాడని అనుకున్నారు. కథ విని నితిన్ కూడా ఓకే చెప్పాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతోంది అనుకొనేలోపు మరో ట్విస్ట్. నితిన్ కూడా ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడు. అయితే ఇది మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీద జరిగిందని తెలుస్తోంది.


దిల్ రాజు .. ఎల్లమ్మకు మార్కెట్ బాగా ఉన్న హీరోను తీసుకోవాలని చూస్తున్నాడు. కనీసంలో కనీసం పెట్టిన ఖర్చుకు సగమైనా రాబట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం నితిన్ పరిస్థితి అంతేమి బాలేదు. అతని నుంచి వచ్చిన సినిమాలు అన్ని అంతంత మాత్రంగానే ఉన్నాయి.  ఇలాంటి టైమ్ లో ఎల్లమ్మను పట్టాలెక్కిస్తే మరింత నష్టం వాటిల్లే ప్రమాదముందని అర్ధం చేసుకున్న దిల్ రాజు.. నితిన్ తో మాట్లాడగా.. ఆయన కూడా అర్ధం చేసుకోని ఈ సినిమా నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇక నాని, నితిన్ తరువాత ఎవరు అంటే శర్వానంద్ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టిన శర్వా దగ్గరకు ఎల్లమ్మ వెళ్లి చేరింది. ఇప్పటికే శర్వా కథ విని ఓకే చేయడం కూడా జరిగిందని సమాచారం. త్వరలోనే ఎల్లమ్మను అధికారికంగా దిల్ రాజు అనౌన్స్ చేయనున్నాడని అంటున్నారు. మరి ఇదైనా ఫైనలా.. లేక మరో కొత్త హీరో మారతాడా..? అనేది తెలియాలి.

Related News

Film industry: ప్రముఖ నటి, ఆస్కార్ గ్రహీత కన్నుమూత!

Siddu Jonnalagadda: లవ్ స్టోరీని బయటపెట్టిన సిద్దు..ఆ తప్పు వల్లే దూరం?

Srikanth Iyengar : గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. ఆ సినిమా బ్యాన్..?

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

Big Stories

×