BigTV English

Sundarakanda Movie Review : ‘సుందరకాండ’ రివ్యూ – స్లోగా సాగే టిపికల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా

Sundarakanda Movie Review : ‘సుందరకాండ’ రివ్యూ – స్లోగా సాగే టిపికల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా

Sundarakanda Movie Review : నారా రోహిత్ ఖాతాలో ‘సోలో’ వంటి ఫ్యామిలీ హిట్ ఉంది. అయితే తర్వాత అతను అలాంటి సినిమా చేయలేదు. దాదాపు పుష్కర కాలం తర్వాత అతను ఓ ఫ్యామిలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘సుందరకాండ’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..


కథ :
సిద్దార్థ్(నారా రోహిత్) వయసు మీద పడ్డ ఓ బ్రహ్మచారి. బాధ్యతగా మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకి అండగా నిలుస్తాడు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి.. తనకు కాబోయే భార్యకి 5 క్వాలిటీస్ ఉండాలని బలంగా ఫిక్స్ అవుతాడు. అటెండ్ అయిన ప్రతి పెళ్ళిచూపుల్లోనూ అమ్మాయిలో ఆ 5 క్వాలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేసి రిజెక్ట్ చేస్తూ.. వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అతను ఆ 5 క్వాలిటీస్ అమ్మాయి కోసం వెతకడానికి ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. అదేంటంటే చిన్నప్పుడు వైష్ణవి(శ్రీదేవి) అనే సీనియర్ ని లవ్ చేస్తాడు.

అయితే ఈ విషయం అతని తండ్రికి తెలిసి సిద్దార్థ్ ని వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. ఆ అమ్మాయిలో ఉండే 5 క్వాలిటీస్ నే సిద్దార్థ్.. తనకు కాబోయే భార్యలో ఉండాలని కోరుకుంటాడు. మొత్తానికి అతనికి ఐరా(విర్తి వాఘాని) అనే అమ్మాయి దొరుకుతుంది. ఆమె కూడా సిద్దార్థ్ లవ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆమె వల్ల వైష్ణవి మళ్ళీ సిద్దార్థ్ జీవితంలోకి ఎంటర్ అవుతుంది.అదెలా? అసలు ఐరాకి.. వైష్ణవికి సంబంధం ఏంటి? చివరికి సిద్దార్థ్.. ఐరాని పెళ్లి చేసుకున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ :
దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఎంపిక చేసుకున్న పాయింట్ ఏమీ కొత్తది కాదు. గతంలో అజయ్ – నాగ శౌర్య కాంబినేషన్లో వచ్చిన ‘దిక్కులు చూడకు రామయ్య’ అనే పాయింట్ నే కొంచెం రివర్స్ చేసి తీశాడు. కాకపోతే నారా రోహిత్ ఏజ్ కి ఇమేజ్ కి ఇది సెట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. బహుశా అతని వల్లే అనుకుంట.. ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనే పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది.

అయితే స్క్రీన్ ప్లే లో చాలా ల్యాగ్ కనిపించింది. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిన ఫీలింగ్ వచ్చినా ఇంటర్వెల్ ట్విస్ట్ అందరినీ కట్టిపడేస్తుంది. నవ్విస్తుంది. సెకండాఫ్ పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. సెకండాఫ్ లో మళ్ళీ సాగదీత ఎక్కువగానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా ఆర్డినరీగానే ఉంటుంది. దర్శకుడే రైటర్ అయితే ఎక్కువ సన్నివేశాలు పెట్టి కథని సాగదీస్తాడు అనే అభిప్రాయాన్ని ఈ సుందరకాండ మరోసారి నిరూపించింది.

రన్ టైం 2 గంటల 20 నిమిషాలే ఉన్నా.. సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది అంటే అది స్క్రీన్ ప్లే ప్రాబ్లమ్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉన్నా.. సెకండాఫ్ కి వచ్చేసరికి దానిని సైడ్ ట్రాక్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి ఎంత అవసరమో అంతవరకు సరిపోయాయి. లియోన్ జేమ్స్ మ్యూజిక్ లో రూపొందిన పాటలు ఒక్కటి కూడా గుర్తుండవు. అవి తీసేస్తే బెటర్ అనే ఫీలింగ్ కూడా కలిగిస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే.. నారా రోహిత్ సింగిల్ ఎక్స్ప్రెషన్ తోనే లాగించేశాడు. ఫిజిక్ పరంగా అతని పొట్టని కవర్ చేయడానికి దర్శకుడు డబుల్ ఎక్స్ ఎల్ టీ షర్ట్..లు, సూట్లు వంటివి వేయించినా.. కవర్ చేయలేకపోయాడు అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో అయితే నారా రోహిత్ లుక్స్ కోసం వీఎఫ్ఎక్స్ కూడా వాడరేమో అనే డౌట్ వస్తుంది.

విర్తి వాగాని పర్వాలేదు. సీనియర్ నటి శ్రీదేవి బాగానే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు నటిగా ఆమె బెటర్ అనిపించింది. సీనియర్ నరేష్, అభినవ్ గోమఠం వంటి స్టార్ కమెడియన్స్ ఉన్నా వాళ్ళ స్థాయి కామెడీ ఈ సినిమాలో లేకపోవడం డిజప్పాయింట్మెంట్. సత్య మాత్రం పర్వాలేదు అనిపించాడు. వాసుకి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వీటీవీ గణేష్ డేట్స్ ఇవ్వలేదు అనుకుంట డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
కామెడీ
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

సాగదీత
సెకండాఫ్
మ్యూజిక్

మొత్తంగా ‘సుందరకాండ’ అక్కడక్కడా నవ్వించినా వీక్ స్క్రీన్ ప్లే కారణంగా ల్యాగ్ అనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు.

Sundarakanda Telugu Movie Rating : 2.5/5

Related News

Bun Butter Jam Review : ‘బన్ బటర్ జామ్’ మూవీ రివ్యూ… జెన్ జెడ్ ఫీల్-గుడ్ ట్రీట్

Paradha Review: ‘పరదా’ రివ్యూ : గుడ్డినమ్మకం పనికిరా(లే)దు 

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Big Stories

×