Idli KottuTrailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush)హీరోగా ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇదివరకు ఈయన కేవలం తమిళ సినిమాలు చేస్తూ ఆ సినిమాలను తెలుగులో విడుదల చేసేవారు కానీ తెలుగులో కూడా ధనుష్ కు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ధనుష్ పూర్తి స్థాయి తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇదివరకే ఈయన నటించిన సార్, కుబేర వంటి సినిమాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. తాజాగా ధనుష్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
నిత్యమీనన్(Nithya Menon) ధనుష్ హీరో హీరోయిన్లుగా నటించిన “ఇడ్లీ కడై” సినిమాను తెలుగులో “ఇడ్లీ కొట్టు”(Idli Kottu) పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ధనుష్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడంతో తన తల్లిదండ్రులు ఇడ్లీ కొట్టు నడుపుతూ తనని పెంచి పెద్ద చేశారని తెలుస్తుంది. ఇలా పెరిగి పెద్దయిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెడతారు.
చేసే పనిని ఆస్వాదించాలి…
ఇలా బిజినెస్ లో ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సక్సెస్ అందుకున్నప్పటికీ, చివరికి తన సొంత గ్రామంలోనే తిరిగి ఒక ఇడ్లీ కొట్టును నడుపుతున్నట్టు ఈ ట్రైలర్ వీడియోని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ వీడియోలో కొన్ని డైలాగులు హైలెట్గా నిలిచాయి “మనం చేసే పని ఆదాయం కోసమే కాదు ఆస్వాదిస్తూ చేయాలి”అంటూ వచ్చే డైలాగులు ఆకట్టుకున్నాయి.”వ్యాపారంలో దొరకని తృప్తి.. వ్యాపకంలో దొరుకుతుంది”అంటూ ధనుష్ చెప్పే డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నిత్యామీనన్ పల్లెటూరి అమ్మాయిగా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు.
ఇలా ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను కూడా పెంచేసింది. ఇక ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. నిత్యమీనన్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, జీవి ప్రకాష్ కుమార్ వంటి తదితరులు ఈ సినిమాలో భాగమయ్యారు ఇక ఈ సినిమా ధనుష్ స్వీయ దర్శక, నిర్మాణంలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక ఇదివరకే ధనుష్ నిత్యామీనన్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తిరు సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఇడ్లీ కొట్టు సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నిజానికి వేసవి సెలవులలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
Also Read: Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!