Nandini Reddy:ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇటీవల సమంతతో ‘మా ఇంటి బంగారం’ సినిమా చేసి మరోసారి తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకుంది. ఇక అలాంటి నందిని రెడ్డి తాజాగా సమంతపై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సమంత అలాంటి నరకం జీవితాంతం అనుభవించాల్సిందే అంటూ చేసిన కామెంట్లు అభిమానులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గత కొంతకాలంగా సమంత ఆటో ఇమ్యూన్ డిసీజ్ మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేనప్పటికీ.. వ్యాధి తీవ్రతరాన్ని తగ్గించవచ్చు. అయితే దీనికోసం సమంత పాటిస్తున్న కఠిన నియమాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ మేరకు సమంత ఆరోగ్య రహస్యంపై నందిని రెడ్డి మాట్లాడుతూ.. “ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్” అంటూ ఒక్క మాటతో అభివర్ణించారు. “దాదాపు రెండు సంవత్సరాలు సమంత రుచి, ఉప్పులేని ఆహారాన్ని తీసుకున్నారు. ఇది బాయిల్డ్, ప్యూరే చేసిన ఆహారం. అయితే సమంత తీసుకునే ఆహారాన్ని ఆమె స్నేహితులు రాహుల్, హిమాంక్ వంటి వారు ప్రయత్నించి దానిని తినలేక విఫలమయ్యారు.
సమంతకి ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి సంపూర్ణ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. ఇందులో అనేక పరిమితులు ఉంటాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్ కి నివారణ ఉండదు. కానీ వ్యాధి పరిమితిని తగ్గించుకోవచ్చు. దానికోసమే సమంత ఈ రేంజ్ లో కఠిన నియమాలు పాటిస్తోంది అంటూ నందిని రెడ్డి తెలిపారు. కఠినమైన ఆహార నియమాలు, ధ్యానం వంటి అనేక విషయాలు ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమిష్టిగా సహాయపడుతున్నాయి అంటూ స్పష్టం చేశారు. మొత్తానికి అయితే నందిని రెడ్డి చేసిన కామెంట్లను బట్టి చూస్తే వ్యాధికి చికిత్స లేదు కాబట్టి ఇలాంటి ఉప్పు, రుచి లేని ఫుడ్ ను తింటూ ఇలాంటి నరకాన్ని సమంత జీవితాంతం అనుభవించాలా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
also read:పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. రాత్రంతా నిద్రపట్టలేదంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్!
మంచి రోజులు.. చెడు రోజులు ఉన్నప్పటికీ సమంత తన క్రమశిక్షణతో కాలాన్ని అధిగమిస్తున్నారు అంటూ సమంత పై నందిని రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ప్రస్తుతం సమంత జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది అని, ఆమె తల్లి కాబోతున్నారని వెల్లడించారు. “గత 15 సంవత్సరాలలో సమంతను ఇంత సంతోషంగా నేనెప్పుడూ చూడలేదు. ఆమె చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. సంతృప్తి అనే పదం జీవితంలో చాలా అరుదుగా మాత్రమే వాడతాము.కానీ సమంత ముఖంలో ఆ సంతృప్తి ఇప్పుడు కనిపిస్తోంది” అంటూ నందిని రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే మా ఇంటి బంగారం సినిమా కోసం ఆమె పడ్డ కష్టాన్ని కూడా నందిని రెడ్డి వివరించారు. మా ఇంటి బంగారం సినిమా క్లైమాక్స్ ఫైట్ లో సమంత ఫ్లిప్ చేశారు కదా.. దానికోసం డూప్ కానీ రోప్ సహాయం కానీ తీసుకోలేదు. ఆమె షాట్స్ అన్నీ సొంతంగా చేసినవే. రిహార్సల్ సమయంలో స్టంట్ కోఆర్డినేటర్ లీ సైతం మొదట సులువు అనుకున్నా.. సమంత పనితీరును చూసి “మై గాడ్ .. షి ఈజ్ ఏ బీస్ట్.. ఇట్స్ క్రేజీ” అంటూ ఆశ్చర్యపోయారని నందిని రెడ్డి తెలిపింది. సమంత అసాధారణమైన శ్రమజీవి, చాలా చురుకైన వ్యక్తి అని కూడా ఆమెపై ప్రశంసలు కురిపించింది.