BigTV English

OTT Movie : చచ్చినోడితో పాటే సమాధిలో ఫోన్ పాతిపెట్టే పిల్లాడు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్

OTT Movie : చచ్చినోడితో పాటే సమాధిలో ఫోన్ పాతిపెట్టే పిల్లాడు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్
Advertisement

OTT Movie : ఓటీటీలో సరికొత్త స్టోరీలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో ఒక సూపర్‌ నాచురల్ మూవీ డిఫరెంట్ కంటెంట్ తో అదరగొడుతోంది. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి, హారర్ ని మిక్స్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా మూవీ పేరు ‘మిస్టర్ హారిగన్స్ ఫోన్’ (MR Harrigans Phone). 2022 లో వచ్చిన ఈ సినిమాకి జాన్ లీ హాన్‌కాక్ దర్శకత్వం వహించారు. ఇది స్టీఫెన్ కింగ్ రాసిన “ఇఫ్ ఇట్ బ్లీడ్స్” అనే నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో డొనాల్డ్ సదర్లాండ్, జేడెన్ మార్టెల్, జో టిప్పెట్, కిర్బీ హోవెల్-బాప్టిస్టే నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌ Netflix లో 2022 అక్టోబర్ 5న విడుదలైంది. ఈ చిత్రం ఒక యువకుడు, ఒక వృద్ధ బిలియనీర్ మధ్య స్నేహం, స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ ప్రభావం, ప్రతీకారం వంటి అంశాలతో తెరకెక్కింది. 1 గంట 46 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.0/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

2003లో హార్లో అనే చిన్న పట్టణంలో నివసించే క్రెయిగ్ పూల్ అనే యువకుడు, తన తల్లి జోన్నా మరణం తర్వాత ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అతని తండ్రి ఒక కార్మిక వర్గ వ్యక్తి. క్రెయిగ్‌ను పెంచడానికి చాలా కష్టపడుతుంటాడు. ఒక రోజు చర్చ్ సేవలో క్రెయిగ్ ఆకర్షణీయంగా కనిపించడంతో, జాన్ హారిగన్ అనే ఒక బిలియనీర్ అతన్ని చూసి వారానికి మూడు సార్లు తన మాన్షన్‌లో పుస్తకాలు చదవడానికి నియమిస్తాడు. హారిగన్ కూడా ఒంటరిగా ఉంటాడు. క్రెయిగ్‌తో “హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్”, “లేడీ ఛాటర్లీస్ లవర్” వంటి పుస్తకాలపై చర్చలు జరుపుతూ అతనితో స్నేహబంధం ఏర్పరుచుకుంటాడు.

హారిగన్ తన వ్యాపార జీవితంలో క్రూరమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ, క్రెయిగ్‌తో సున్నితమైన సంబంధాన్ని పెంచుకుంటాడు. అతనికి లాటరీ టిక్కెట్లు బహుమతిగా ఇస్తాడు.2007లో మొదటి ఐఫోన్ విడుదలైనప్పుడు, క్రెయిగ్ ఒక లాటరీ టిక్కెట్‌తో $4,000 గెలుచుకుని, హారిగన్‌కు ఒక ఐఫోన్ కొనివ్వడం ద్వారా టెక్నాలజీని పరిచయం చేస్తాడు. హారిగన్ మొదట్లో ఫోన్‌ను తిరస్కరిస్తాడు. స్మార్ట్‌ఫోన్‌లు సమాజంపై చెడు ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తాడు. కానీ తర్వాత దానికి అలవాటు పడతాడు.

ముఖ్యంగా టామీ వైనెట్ “స్టాండ్ బై యువర్ మ్యాన్” పాటను రింగ్‌టోన్‌గా సెట్ చేస్తాడు. 2008లో హారిగన్ గుండెపోటుతో మరణిస్తాడు, క్రెయిగ్‌కు $800,000 ట్రస్ట్ ఫండ్‌ను వదిలివేస్తాడు. హారిగన్ అంత్యక్రియల సమయంలో, క్రెయిగ్ అతని ఐఫోన్‌ను అతని జాకెట్ జేబులో ఉంచుతాడు. క్రెయిగ్ హైస్కూల్‌లో ఉన్నప్పుడు కెన్నీ యాంకోవిచ్ అనే బుల్లీ అతని పై దాడి చేస్తాడు. డ్రగ్ డీలింగ్ గురించి పాఠశాల యాజమాన్యం కు చెప్పినందుకు క్రెయిగ్ ను గాయపరుస్తాడు. ఒంటరితనం, నిరాశలో ఉన్న క్రెయిగ్ హారిగన్ ఫోన్‌కు కాల్ చేసి, కెన్నీ గురించి ఫిర్యాదు చేస్తాడు.

మరుసటి రోజు, కెన్నీ తన గది కిటికీ నుండి పడి మరణిస్తాడు. అది ఒక ప్రమాదంగా కనిపిస్తుంది. క్రెయిగ్ భయపడి, తన పాత ఫోన్‌ను దాచి, కొత్త ఐఫోన్‌కు మారతాడు. సంవత్సరాల తర్వాత, క్రెయిగ్ బోస్టన్‌లో జర్నలిజం చదువుతున్నప్పుడు, అతని బయాలజీ టీచర్ మిస్ హార్ట్ ఒక మద్యపాన డ్రైవర్ డీన్ విట్‌మోర్ వల్ల కారు ప్రమాదంలో మరణిస్తుంది. విట్‌మోర్ ధనవంతుడైన వ్యక్తిగా, జైలు శిక్ష నుండి తప్పించుకుంటాడు. దీనిపై క్రెయిగ్ కోపంతో హారిగన్ ఫోన్‌కు మరోసారి కాల్ చేసి, విట్‌మోర్ మరణించాలని కోరుకుంటాడు.

తర్వాత విట్‌మోర్ షాంపూ, సబ్బు ముక్కలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అతని ఆత్మహత్య నోట్‌లో “స్టాండ్ బై యువర్ మ్యాన్” పాట లిరిక్ ఉంటుంది. ఇది హారిగన్ ప్రజెంట్ ఉపయోగిస్తున్న రింగ్‌టోన్. క్రెయిగ్ తన కోరికలు హారిగన్ దెయ్యం ద్వారా నెరవేరుతున్నాయని భయపడి, అతని గతాన్ని పరిశీలిస్తాడు. ఆ తరువాత కొన్ని షాకింగ్ విషయాలను క్రెయిగ్ తెలుసుకుంటాడు. ఇంతకీ క్రెయిగ్ తెలుసుకున్న సీక్రెట్స్ ఏమిటి ? హారిగన్ నుంచి క్రెయిగ్ బయట పడతాడా ? హారిగన్ ఆత్మ క్రెయిగ్ ను ఎందుకు ఫాలో అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : అమ్మాయిలను బుక్ చేసుకుని, టార్చర్ చేసి చంపేసే సైకో… వర్త్ వాచింగ్ రియల్ కొరియన్ కథ

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×