E-Paper
Advertisement

వెయిటింగ్ ఈజ్ ఓవర్. Nothing Buds Pro 2 కేస్ డిజైన్, బ్యాటరీ వివరాలు లీక్!

వెయిటింగ్ ఈజ్ ఓవర్. Nothing Buds Pro 2 కేస్ డిజైన్, బ్యాటరీ వివరాలు లీక్!
Advertisement

Nothing Buds Pro 2: టెక్ ప్రపంచంలో తమదైన స్టైలిష్ డిజైన్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ సంస్థ.. త్వరలోనే మరో కొత్త ఆడియో ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీగా ఉంది. ఇటీవల నథింగ్ ఇయర్ (3a) మోడల్‌ను పరిచయం చేసిన ఈ కంపెనీ.. ఇప్పుడు ‘నథింగ్ బడ్స్ ప్రో 2’ పేరుతో కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తున్నట్లు టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం:

ఈ కొత్త ఇయర్‌బడ్స్ అమెరికాకు చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అక్కడ ఉన్న సమాచారం ప్రకారం.. ఈ పరికరం మోడల్ నంబర్ B195గా ఉంది. దాంతో పాటు అక్కడ ఉన్న లేబుల్ ఇమేజ్‌లో ‘నథింగ్ బడ్స్ ప్రో 2’ అని స్పష్టంగా పేరు రాసి ఉండటంతో.. త్వరలోనే ఇవి మార్కెట్లోకి రావడం ఖాయమని అర్థమవుతోంది.

Advertisement

Also Read: యాపిల్ మాస్టర్ ప్లాన్.. ఐఫోన్ కంటే ముందే మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త డివైజ్!

ఛార్జింగ్ కేస్, బ్యాటరీ వివరాలు:

లీక్ అయిన FCC పత్రాల ద్వారా ఈ బడ్స్ ఛార్జింగ్ కేస్ వివరాలు బయటపడ్డాయి. దీని కేస్‌లో 460mAh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ఉండనుంది. ఇది 3W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక డిజైన్ విషయానికి వస్తే.. కేస్ గుండ్రటి రెక్టాంగిల్ ఆకారంలో, వెనుక భాగంలో కాస్త లోతుగా ఉన్న సెక్షన్‌తో కొత్తగా కనిపించనుంది.

నథింగ్ బ్రాండింగ్‌లో తొలిసారి:

Advertisement

ఇప్పటివరకు నథింగ్ కంపెనీ బడ్స్ ప్రో అనే పేరును కేవలం తమ సబ్ బ్రాండ్ అయిన CMF ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగించింది. అయితే, ఈసారి నేరుగా నథింగ్ మెయిన్ బ్రాండింగ్ ‌లోనే బడ్స్ ప్రో 2 పేరుతో రాబోతుండటం విశేషం. ప్రస్తుతానికి ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన లాంచ్ డేట్, ధర, ఇతర ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: కరెంట్ పోయినా నో టెన్షన్.. పవర్‌బ్యాంక్‌లా పనిచేసే నోకియా కొత్త ఫోన్ చూశారా?

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×