BigTV English

25 Maoists Surrender: మావోలకు దెబ్బ మీద దెబ్బ.. 25 మంది లొంగుబాటు, బలహీనపడుతున్న మావోలు

25 Maoists Surrender: మావోలకు దెబ్బ మీద దెబ్బ.. 25 మంది లొంగుబాటు, బలహీనపడుతున్న మావోలు

25 Maoists Surrender: మావోయిస్టులు క్రమక్రమంగా బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు ఎన్‌కౌంటర్లలో కొందరు మరణించగా, మరికొందరు లొంగిపోతున్నారు. మావోలకు కేరాఫ్‌గా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మావోలు ఉనికి కోల్పోయి పరిస్థితి ఏర్పడినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.


ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు 25 మంది మావోయిస్టులు. బైరాంఘడ్, గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్‌ఓ‌ఎస్ సభ్యుడు, సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

ఐదుగురు మావోయిస్టులపై 28 లక్షల రివార్డు ఉంది. గంగ్లూర్, భైరామ్‌గఘ్ ప్రాంతాల్లో వీరు యాక్టివ్‌గా ఉండేవారు. శంబటి మడ్కం, జ్యోతి పునెం ఇద్దరు మహిళలతోపాటు మహేష్ తేలం ఒక్కొక్కరిపై 8 లక్షల రివార్డు ఉంది. ఇంకా విష్ణు కార్తమ్ అలియాస్ మెనూ, జయదేవ్ పొడియమ్ లపై మూడేసి లక్షల రివార్డు ఉంది.


ALSO READ:  త్వరలో ప్రత్యేక మెడికల్ స్టోర్స్ ప్రారంభిస్తాం..కేంద్ర మంత్రి

గుడ్డం కకేమ్, సుద్రుపూణెంలపై చెరో 10 లక్షల చొప్పున రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులు, ఒక్కొక్కరిపి 25 వేల చొప్పున సాయంతోపాటు ప్రభుత్వం ప్రకటించిన పునారావాస సదుపాయాలు కల్పిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. వీళ్లతో కలిసి ఇప్పటివరకు 170 మంది మావోయిస్టులు లొంగిపాయారని, మరో 306 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

మూడేళ్ల కిందట రాజ్యసభలో ఓ ప్రశ్నకు జవాబు ఇచ్చిన మంత్రి.. దేశంలో వామపక్ష తీవ్రవాద హింస, వారి భౌగోళిక విస్తృతి గణనీయంగా తగ్గిందని తెలిపారు. 15 ఏళ్ల కిందట 1000 మందికి పైగా సాయుధ బలగాలు, పౌరులు మరణించగా, 2020 నాటికి ఆ సంఖ్య 200 లకు చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పడిపోయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నమాట.

2026 నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించాడు. నాలుగురోజుల కిందట రాయ్‌పూర్‌లో వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2004-2014 మధ్యకాలంతో పోల్చితే.. 2014-24 మధ్య దేశంలో మావోయిస్టుల ఘటనలు సగానికి పైగానే తగ్గాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో నక్సల్స్ ఘటనలు 53శాతం తగ్గుదల నమోదైందన్నారు.

2024 నాటికి దేశంలో కేవలం తొమ్మిది రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని కేంద్ర హోంశాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో కేవలం 38 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని వెల్లడించింది. చత్తీస్ ఘడ్ 15 జిల్లాలు, ఒడిషా-7, జార్ఖండ్-5, మధ్యప్రదేశ్-3, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళలో రెండు జిల్లాలు, ఏపీ, బెంగాల్ ల్లో ఒక్కో జిల్లాలకు పరిమితమైనట్టు తెలిపింది. వామపక్ష తీవ్రవాదాన్ని చివరి దెబ్బ తీసేందుకు భద్రతా లోపాలను సరి చేస్తున్నట్లు తెలియజేశారు.

మావోయిస్టుల ఉద్యమానికి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్‌గా ఉండేది. ప్రస్తుతం అక్కడ గణనీయంగా బలహీనపడింది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యనేతలు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించారు. ఇంకోవైపు బలగాల కూంబింగ్‌ల్లో మావో దళాలు చాలావరకు దెబ్బ తిన్నాయి. ఒకప్పుడు మావోల అణిచివేతలో నాటి ఏపీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు కీలకపాత్ర పోషించాయి. వారిని అణిచివేతకు ఏపీని మోడల్‌గా మిగతా రాష్ట్రాలు తీసుకున్న విషయం తెల్సిందే.

 

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×