BigTV English

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు!

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు!

DA Hike for Central Government Employees: డీఏ పెంపు, అరియర్స్‌పై ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారికి ఓ బిగ్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కేంద్రం నుంచి రెండు పెద్ద బహుమతులు లభించే అవకాశం ఉంది – ఒకటి కరువు భత్యం (Dearness Allowance)పెంపు, మరొకటి 18 నెలల బకాయిలను విడుదల చేయడం. దీని వలన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగే అవకాశం ఉంది.


త్వరలో 18 నెలల బకాయిలు:

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కోవిడ్ మహమ్మారి సమయంలో 18 నెలల పాటు నిలిపివేసిన కరువు భత్యం (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు బకాయిలను పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.


గతంలో నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలను విడుదల చేయాలని భారతీయ ప్రతిక్ష మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ముఖేష్ సింగ్ లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కోవిడ్ వ్యాప్తి కారణంగా, కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల పాటు డీఏ, డీఆర్ చెల్లింపులను నిలిపివేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా డీఏ, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు. జూలై 1, 2023 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది.

డీఏ పెంపు ఎంత..?

ఈసారి కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 4 శాతం పెరిగే అవకాశం ఉందని, దీనిని మార్చిలో ఆమోదించి ఏప్రిల్లో చెల్లించే అవకాశం ఉందన్నారు. కొత్త డీఏ రేటు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

మార్చిలో డీఏ పెంపు ప్రకటన తర్వాత 2024 ఏప్రిల్ వేతనంలో చెల్లిస్తారు. హోలీకి ముందే ఉద్యోగులకు కరువు భత్యం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీన్ని పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల డబ్బు ఏకమొత్తంలో లభిస్తుంది.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×