BigTV English

Elephants Heart Warming Video: బిడ్డ కోసం తల్లి కన్నీరు.. పిల్ల ఏనుగును తల్ధలి ఏనుగు దగ్గరకి చేర్చిన అధికారులు

Elephants Heart Warming Video: బిడ్డ కోసం తల్లి  కన్నీరు.. పిల్ల ఏనుగును తల్ధలి ఏనుగు దగ్గరకి చేర్చిన అధికారులు

Mother Elephant & Baby Elephant Video Viral: అమ్మ ప్రేమ.. ఈ సృష్టిలో అత్యంత మధురమైనది. అమ్మ లేనిదే బ్రహ్మ కూడా లేడు. అమ్మంటే ఓ అనుబంధం.. అమ్మంటే ఓ అనురాగం.. ఆత్మీయత. ఆమె ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. తల్లి లేకుండా బిడ్డలు ఉంటారేమో గానీ.. తల్లి మాత్రం బిడ్డలను వదలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అలాంటి తల్లి తన బిడ్డల కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడదు. ఎంతటి కష్టాలైన ఓర్చుకుంటుంది. తన బిడ్డ కనిపించకుండా పోతే కన్నీరు పెడుతుంది. పచ్చి నీరు కూడా ముట్టకుండా.. బిడ్డ ఆచూకీ దొరికే వరకు వెతుకుతూనే ఉంటుంది.


ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనే అమ్మ ప్రేమ అలానే కనబడుతుంది. అయితే ఓ ఏనుగు తన బిడ్డ కోసం చూపించిన ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పడు చూద్దాం.

Read More: ఆదమరచి నాట్యం చేస్తున్న బ్లాక్ కింగ్ కోబ్రాలు.. వీడియో చూస్తే వణుకే!


తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వాయర్‌లో ఏనుగులు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇది పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం. కాబట్టి ఏనుగులు అందులోనే ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఓ చిన్ని ఏనుగు పిల్ల అడవిలో తప్పిపోయింది.

దీంతో ఆ చిన్ని ఏనుగు తల్లి అడవి మొత్తం దాని ఆచూకీ కోసం తిరగడం ప్రారంభించింది. పచ్చి నీరు కూడా ముట్టకుండా, తిండి తినకుండా కంటనీరుతో అడవీ మొత్తం ఆర్తనాదాలు చేసింది. ఇది అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో వెంటనే స్పందించిన అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాల సాయంతో ఆ తల్లి ఏనుగు జాడను రెండు రోజుల తర్వాత కనిపెట్టారు.

Read More:  కాలీఫ్లవర్‌లో దూరిన పాము..! వైరల్ గా మారిన వీడియో

అనంతరం వారి వద్దున్న ఏనుగు పిల్లలను జాగ్రత్తగా దాని తల్లి ఏనుగు వద్దకు చేర్చారు. ఆ చిన్ని ఏనుగును చూసిన వెంటనే ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చిన్ని ఏనుగును తొండంతో ప్రేమగా దగ్గరకు లాక్కొని నిమిరింది. చాలా సేపు తర్వతా అలానే చిన్ని ఏనుగును తన దగ్గర ఉంచుకుని ఆ తర్వాత అడవిలోకి తీసుకెళ్లింది.

అన్నామలై ఫారెస్ట్ అధికారులు చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను సుప్రియా సాహూ అనే ఐఏఎస్ అధికారి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఏనుగు ఆర్థనాదాలు, చిన్ని ఏనుగు తప్పిపోవడం, ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాలు వాడటం గురించి, ఏనుగు పిల్లను తల్లి ఏనుగు వద్దకు చేర్చడం వరకు ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అటవీ అధికారులు నెటిజన్ల చేత శభాష్ అనిపించుకుంటున్నారు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×