BigTV English

KL Rahul: వికెట్లు పడుతున్నా ఆసీస్‌ ను వణికించిన రాహుల్‌…వర్షంలోనూ పోరాటం!

KL Rahul: వికెట్లు పడుతున్నా ఆసీస్‌ ను వణికించిన రాహుల్‌…వర్షంలోనూ పోరాటం!

KL Rahul: బోర్డర్ భాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా… ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో… ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ టీమ్ ఇండియా గెలువగా… రెండవ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక అదే ఊపును మూడవ టెస్టులో కూడా కొనసాగిస్తోంది ఆస్ట్రేలియా. గబ్బా వేదికగా.. మూడవ టెస్ట్ జరుగుతోంది.


Also Read:  Mumbai Indians: మెగా వేలంలో ముంబై భారీ తప్పిదం..ట్రోఫీ ఇక కష్టమే ?

అయితే ఈ టెస్టులో… ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. మొదటి ఇంచులు 445 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. అయితే మొదటి ఇన్నింగ్స్ కు దిగిన టీమిండియా మాత్రం… 165 కి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో ఉందని చెప్పవచ్చు. అయితే టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది అంటే దానికి ఒక్కరే ఒక కారణం… కె ఎల్ రాహుల్ ( KL Rahul ). వర్షం పడుతున్నా… వికెట్లు రాలిపోతున్న… కె ఎల్ రాహుల్ ( KL Rahul ) మాత్రం.. ఏమాత్రం తగ్గలేదు.


సెంచరీ మిస్ అయ్యాడు కానీ… టీమిండియా కు మంచి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యారు. కానీ గేయాలు రాహుల్ మాత్రం 139 బంతుల్లో 84 పరుగులు చేశాడు. టెస్ట్ మ్యాచ్ ను ఒక వన్డేలా ఆడాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు కూడా ఉన్నాయి. నిన్నటి నుంచి బ్యాటింగ్ చేస్తున్న కే ఎల్ రాహుల్ ( KL Rahul )…. ఇవాళ లయన్ బౌలింగ్ లో బోల్తా పడ్డాడు.

లయన్… బౌలింగ్లో స్టీవెన్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ ( KL Rahul ). దీంతో 84 పరుగుల వద్ద కె ఎల్ రాహుల్ ( KL Rahul ) అవుట్ కావడం జరిగింది. కె ఎల్ రాహుల్ వికెట్ పడే సమయానికి…టీమిండియా స్కోర్ 165 పరుగులు ఉంది. ప్రస్తుతం రవీంద్ర జడేజా అలాగే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్నారు. రవీంద్ర జడేజా 41 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. అటు నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నోడే. కాబట్టి ఇవాళ డే మొత్తం… టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: Anil Kumble on Virat Kohli: కోహ్లీపై కుంబ్లే తీవ్ర విమర్శలు.. లండన్ లో సెటిల్ అయ్యే సమయం వచ్చిందంటూ..!

రేపు ఆస్ట్రేలియా మళ్ళీ బ్యాటింగ్ చేస్తుంది. అయితే ప్రస్తుత లెక్క ప్రకారం… ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటిరోజు ఆటలో… వర్షం విలన్ గా మారింది. దాదాపు 72 ఓవర్లు.. వర్షం కారణంగా వృధా అయ్యాయి. రెండో రోజు అలాగే నిన్న కూడా అదే పరిస్థితి ఉంది. ఇవాళ అలాగే రేపు కూడా వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే జరిగితే మూడవ టెస్ట్ డ్రాగా మారే ఛాన్సులు ఉన్నాయి.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×