Farmer: అతి భద్రత కూడా కొన్నిసార్లు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పైన కనిపించిన రైతు విషయంలో అదే జరిగింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బులు దాచే ప్రయత్నం చేశాడు. చివరకు ఆ డబ్బంతా మట్టిపాలు అయ్యింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలు ఏం జరిగింది?
రాజస్థాన్‌లో ఓ రైతుకు ఊహించని ఘటన ఎదురైంది. పచ్‌పాద్రాకు చెందిన రైతు మంగీలాల్ మేఘ్వాల్.. ఏడాది కిందట తనకున్న కొంత భూమిని విక్రయించాడు. అందుకు ఆయన చేతికి రూ.5 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలని ఆలోచన చేశాడు. ఐదు లక్షలు ఇంట్లో పెడితే ఎవరైనా చోరీ చేసే అవకాశముందని భయపడ్డాడు. ఆ డబ్బు ఏం చెయ్యాలో తెలియక కొద్దిరోజులు సతమతమయ్యాడు. డబ్బును చూసి ఇంట్లో వాళ్లు వృథా ఖర్చులు చేయడం ఖాయమని భావించాడు. అలా చేస్తే డబ్బు తరిగిపోవడం ఖాయమని అనుకున్నాడు.
దీంతో డబ్బును ఎలా జాగ్రత్త చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. వచ్చిన డబ్బును తనకున్న భూమిలో పాతిపెడితే బాగుంటుందని అనుకున్నాడు. ఆలోచన రాగానే దాన్ని అమలు చేశాడు. కుటుంబసభ్యులకు తెలియకుండా రాత్రి వేళ పొలానికి వెళ్లాడు. అక్కడ పాలిథీన్ కవర్‌లో చుట్టిన రూ.5 లక్షలు పొలంలో పాతి పెట్టాడు. ఇక అక్కడితో ఆ రైతుకు డబ్బు టెన్షన్ తగ్గింది. కొంతకాలానికి డబ్బు అవసరం పడడంతో పాతిపెట్టిన చోటు మర్చిపోయాడు రైతు. ఎంత ఆలోచించినా ఆ ప్రాంతం గుర్తుకు రాలేదు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారంతా వెతికినా పొలంలో ఎక్కడా డబ్బుల జాడ కనిపించలేదు.
గడిచిన నెల రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వ్యవసాయానికి సిద్ధమైన సదరు రైతు, ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా డబ్బులున్న బ్యాగు ఠక్కున బయటపడింది. నోట్ల కట్టలు బయటపడ్డాయికానీ, వాటికి చెదలు పట్టేశాయి. వాటిని చూసి నిరాశకు లోనయ్యాడు. చివరిగా ఈ నోట్లను బ్యాంకులో ఇచ్చి కొత్తవి తెచ్చుకోవాలని అనుకున్నాడు. నోట్లు బాగా పాడైపోవడంతో వివిధ బ్యాంకులు తిరస్కరించాయి. జైపూర్‌లోని పెద్ద బ్యాంకులను సంప్రదించాలని సలహా ఇచ్చాయి. డబ్బులో కొంతైనా తిరిగొస్తే బాగుండని రైతు ఆశిస్తున్నాడు. అతి భద్రతకు వెళ్లి మొత్తం నాశనం అయ్యిందని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
ALSO READ: వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం, చూసేందుకు ఎగబడుతున్న జనం
🚨A Rajasthan farmer who buried Rs 5 lakh in his field to protect the cash from theft was left in distress after he forgot where he had hidden the money.
The cash was eventually found nearly a year later, but termites had damaged most of the notes by then. pic.twitter.com/bqr4lpi61A
— Indian Infra Report (@Indianinfoguide) August 11, 2026