Parvesh Verma: ఢిల్లీలో రోడ్డు నిర్మాణ తనిఖీల సందర్భంగా తన సెల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తున్న యువకుడుని మంత్రి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ చెంప మీద కొట్టాడు. దీంతో ఈ సంఘటన కలకలం రేపుతుంది. సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్‌గా మారింది. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక రోడ్డు నాణ్యతను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు మంత్రి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ కొట్టారు.
దీంతో వీడియో తీసిన యువకుడి పై దాడి చేయడాన్ని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మను అరెస్ట్ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రేపు తిలక్ నగర్‌లో పర్యటిస్తానని కేజ్రీవాల్ అన్నారు. ఆ రోడ్డు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సదరు యువకుడు మంత్రిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ మంత్రిపై తీవ్రంగా స్పందించారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, పోలీసు భద్రత మధ్య ఒక యువకుడిపై దాడి చేయడం మంత్రి అహంకారానికి, గుండాయిజానికి నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, మంత్రి పర్వేష్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also read: ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!