Bengaluru: ప్రపంచవ్యాప్తంగా ఏఐ మేనియా కొనసాగుతోంది. కంపెనీలు వాటిని తయారు చేస్తుంటే.. ప్రభుత్వాలు వాటిని ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏఐ ద్వారా సామాన్యులకు కష్టాలు మొదలయ్యాయి. తాజాగా బెంగుళూరులో ఓ వాహనదారుడికి రూ. 500 జరిమానా విధించింది ఏఐ కెమెరా. దీంతో షాకవ్వడం వినియోగదారుడి వంతైంది. అసలు ఏం జరిగింది?
రూల్స్ అతిక్రమిస్తున్న వాహనదారులపై ఉక్కుపాదం మోపేందుకు టెక్నాలజీని విస్తారంగా ఉపయోగిస్తున్నాయి వివిధ రాష్ట్రాలు. తొలుత ఏఐ టెక్నాలజీని ట్రాఫిక్ విభాగాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ విషయంలో హర్యానా ముందు ఉందని చెబుతుంటారు. ఎందుకంటే వాహనాలు వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫలానా నెంబర్ వాహనదారులు చలాన్ పెండింగ్‌లో ఉందని డిస్‌ప్లే చేసే బోర్డులు వచ్చాయి.
కొన్ని రాష్ట్రాలైతే గీత దాటుతున్న వాహనదారులకు చలాన్లు వేసే విభాగాన్ని ఐఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి. ఈ విషయంలో బెంగుళూరు సిటీ ఓ అడుగు ముందుకేసింది. ఫలితంగా ఇన్నాళ్లు మాదిరిగా వాహనదారులు కాస్త జాగ్రత్తగా వెళ్తున్నారు. అదే సమయంలో పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. టూ వీలర్ వెనుక ఏమైనా సామాన్లు తీసుకెళ్తుంటే వాటిని క్లిక్ మనిపించి వాహనదారుడి వాట్సాప్‌కు చలానా రసీదు పంపిస్తున్నారు పోలీసులు.
తాజాగా బెంగళూరులో AI ఆధారిత ట్రాఫిక్ కెమెరా.. వాహనదారుడు వెనుక గిటార్ పెట్టుకుని వెళ్తున్నాడు. దాన్ని పొరపాటుగా వ్యక్తిగా భావించింది. హెల్మెట్ లేకుండా వెనుక కూర్చున్నాడని భావించి గిటార్‌కు రూ. 500 చలాన్ విధించింది. సదరు వాహనదారుడి వాట్సాప్‌కు మేసెజ్ తోపాటు వాట్సాప్‌లో చలానా రసీదు పంపండంతో వాహనదారుడు షాకయ్యాడు. ఈ విషయాన్ని సదరు వాహనదారుడు అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇలాంటి తప్పులను సరిచేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి వాహనదారుడు ఆ ఫోటో, రసీదు ఎక్స్ వేదికగా షేర్ చేశాడు.
ALSO READ: ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్
దీనికి బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ దత్తా పోస్టు పెట్టారు. నేను బెంగళూరులో నా వీపుపై గిటార్ వేసుకుని, నా భార్య ద్విచక్ర వాహనంపై ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వెనుక కూర్చున్నందుకు నా భార్యకు ట్రాఫిక్ చలాన్ (నోటీసు నెం. 86202541) వచ్చింది. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘనల గుర్తింపు అంటే ఇదేనా! దయచేసి ఈ చలాన్‌ను రద్దు చేయాలని పేర్కొన్నారు.
I was riding my wife's two-wheeler alone with my guitar slung on my back in Bangalore. @blrcitytraffic my wife received a traffic challan (notice no. 86202541) for "pillion riding without helmet". So much for AI based traffic violation detection! Pls revoke the challan #AISlop pic.twitter.com/fYCn9OoUNQ
— Souvik Dutta (@souvikonline) September 26, 2026