BigTV English

Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి..?

Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి..?
aadhar
aadhar card

Blue Aadhaar Card : బ్లూ ఆధార్ కార్డ్.. దీన్నే బాల్ ఆధార్ అని కూడా అంటారు. ఈ ఆధార్ కార్డ్ నీలి రంగులో ఉంటుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ ఆధార్ జారీ చేస్తారు. ఈ ఆధార్ కార్డ్ పిల్లలకు 5 సంవత్సరాలు వయసు వచ్చే వరకు చెల్లుబాటు అవుతోంది. పిల్లలకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ బ్లూ ఆధార్‌ను పక్కనబెట్టి.. బయోమెట్రిక్ సమాచారాన్ని అప్ డేట్ చేసి సాధారణ ఆధార్ కార్డ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


బ్లూ ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుంది?

ఈ బ్లూ ఆధార్ కార్డ్‌ను జారీ చేయడానికి పిల్లల బయోమెట్రిక్ అవసరం లేదు. ఆ కార్డును తల్లిదండ్రుల యుఐడితో జత చేస్తారు. ఫోటో, డెమోగ్రాఫిక్ సమాచారం ఆధారంగా ఈ బ్లూ ఆధార్ యూఐడీని మంజూరు చేస్తారు.


బ్లూ ఆధార్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

నవజాత శిశువు బర్త్ సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్ ఉపయోగించి ఈ బ్లూ ఆధార్ కార్డ్ ధరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ ఐడీని కూడా ఈ ఆధార్ కోసం ఉపయోగించుకోవచ్చు.

Read More: పథకాలు అమలు చేయమని చెప్పలేం.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

బ్లూ ఆధార్ కార్డు ఎందుకు ముఖ్యం?

ఈ బ్లూ ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి.. పిల్లలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ, సహాయ కార్యక్రమాలను పొందొచ్చు.ఈడబ్ల్యుఎస్ స్కాలర్షిప్‌లు అందించడంలో ఈ ఆధార్ సహాయపడుతుంది. పిల్లల స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియలో బ్లూ ఆధార్ కార్డులను సమర్పించాల్సి వస్తోంది.

బ్లూ ఆధార్ కార్డు కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

  • ముందుగా యూఐడీఏఐ వెబ్ సైట్ కు వెళ్లి ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత పిల్లల పేరు, తల్లిదండ్రులు/సంరక్షకుల మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం అపాయింట్మెంట్ స్లాట్ తీసుకోవాలి.
  • దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్మెంట్ సెంటర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పిల్లల జనన ధృవీకరణ పత్రంతో సహా అవసరమైన పత్రాలతో నమోదు కేంద్రంలో అందించాలి.

Read More : బ్యాగ్ లేకుండానే స్కూల్‌కి.. మధ్యప్రదేశ్‌లో వారానికోసారి అమలు..

  • దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతోంది.
  • వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 60 రోజుల్లోగా మీ పిల్లల పేరు మీద బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×