AAI Junior Executive recruitment 2026: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లో ఉద్యోగం చేయాలనే కల చాలా మందిలో ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏకంగా 389 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా 389 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మేనేజర్ , జూనియర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీల కింద సివిల్,ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఐటీ, లా, ఆపరేషన్స్, కమర్షియల్, సర్వే అండ్ కార్టోగ్రఫీ వంటి పలు విభాగాల్లో పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: ఈ పోస్టులకు ఎలాంటి పని అనుభవం అవసరం లేదు. సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) లేదా నిర్దిష్ట డిగ్రీ/పీజీ పూర్తి చేసిన వారు నేరుగా అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే ఎంబీఏ,లా,ఇంజనీరింగ్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
మేనేజర్ పోస్టులకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు కాగా.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
మేనేజర్ పోస్టులకు.. జీతం రూ. 60,000 నుంచి 1,80,000వరకు ఉంటుంది.జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు..రూ. 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. వీటితో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ అలవెన్సులు , ఇతర పీఎఫ్ బెనిఫిట్స్ వర్తిస్తాయి.
Also Read: డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !
మొదటగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. ఆ తర్వాత పోస్టుల ఆధారంగా అప్లికేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్స్ లేదా ఇంటర్వ్యూ ఉంటాయి. అనంతరం మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ రౌండ్ కూడా తప్పని సరిగా ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా..అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 7 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.