BigTV English

Minister Atishi Claims: బీజేపీ బంపరాఫర్.. ఓకే కాకుంటే మేం జైలుకే..!

Minister Atishi Claims: బీజేపీ బంపరాఫర్.. ఓకే కాకుంటే మేం జైలుకే..!
AAP Minister Atishi Claims BJP Switch Offer,These AAP Leaders To Be Arrested Soon


Minister Atishi Claims: ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు మొదలయ్యేనాటికి మరో నాలుగురు ఆప్ నేతలు అరెస్ట్ కావచ్చని ఆరోపించారు. అందులో తాను కూడా ఉంటానని తెలిపారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, తనతోపాటు మంత్రి సౌరబ్ భరద్వాజ్, మరోనేత దుర్గేశ్ పాథక్, ఎంపీ రాఘవ్ చద్దా ఆ లైన్‌లో ఉండే అవకాశముందని తెలిపారు.

సీఎం కేజ్రీవాల్ కస్టడీ సందర్భంగా న్యాయస్థానంలో వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తన పేరు ఈడీ ప్రస్తావించినట్టు మంత్రి ఆతిశీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు విజయ్‌నాయర్.. మంత్రి వర్గంలోకి ఆతిశీ, సౌరబ్‌కు రిపోర్టు చేసేవాడనని ముఖ్యమంత్రి అన్నట్లుగా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆతిశీ వ్యాఖ్యలు చేశారు. ఈ స్టేట్‌మెంట్ సీబీఐ, ఈడీ వద్ద ఎప్పటినుంచో ఉందని, దాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్‌సింగ్, సత్యేంద్రజైన్ అరెస్ట్ తర్వాత ఆప్ ఐక్యంగా ఉందని బీజేపీ భావించడమే దీనికి కారణమన్నారు.


వరుసలో ఉన్న తమని జైలుకి పంపించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దుయ్యబట్టారు మంత్రి ఆతిశీ. తన పొలిటికల్ కెరీర్‌ని కాపాడుకోవాలంటే బీజేపీలో చేరేలా ఓ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరిపినట్టు చెప్పుకొచ్చారు. జాయిన్ కాకపోతే ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆ వ్యక్తి ద్వారా చెప్పించారని గుర్తు చేశారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

ALSO READ : లెక్కల్లో మాంచి దిట్ట.. కారు, ఇల్లు లేని యువరాజు

దీనికి సంబంధించి రెండు ప్రొవిజన్స్ ఉన్నాయని, రెండేళ్లకు పైగా శిక్ష పడితే ప్రజాప్రతినిధిగా ఉండేందుకు వీలుండదన్నారు. కేజ్రీవాల్ ఇంకా దోషిగా తేలలేదన్నారు. మరోవైపు ఈ మద్యం కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ని తీహార్ జైలుకు తరలించారు.

Tags

Related News

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Big Stories

×