Telangana : ఆపరేషన్ సిందూర్‌తో ఇండియన్ ఆర్మీకి జేజేలు పలుకుతోంది యావత్ భారతదేశం. సోల్జర్సే ఇప్పుడు మన రియల్ హీరోస్. ప్రధాని మోదీ సైతం స్వయంగా సైనికులను కలిసి అభినందించారు. వారికి స్వీట్స్ తినిపించి ప్రశంసించారు. భారత్ ఇప్పుడింత ప్రశాంతంగా ఉందంటే.. అది బోర్డర్‌లో మన సైనికుల వీరత్వవే. ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నారు. వారక్కడ నిద్ర లేకుండా పహారా కాస్తుంటే.. మనమిక్కడ గుండెలపై చేతులు పెట్టుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నాం. అందుకే, ఆర్మీని గుండెల్లో పెట్టుకుంటోంది దేశం. వారికి ఎన్ని అవార్డులు, రివార్డులు ఇచ్చినా తక్కువే. వారి సాహసానికి సెల్యూట్.
జవాన్ భూ పోరాటం..
అలాంటి ఓ జవాన్‌కు స్వగ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. అతని పేరు రామస్వామి. BSF జవాన్. ప్రస్తుతం బోర్డర్‌లోనే డ్యూటీ చేస్తున్నారు. అతని సొంతూరు సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లె. ఎప్పుడో సెలవులప్పుడు, ఏడాదికోసారి గ్రామానికి వెళ్తుంటాడు. అతని తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. ఊరిలో కొంత పొలం కూడా ఉంది అతనికి. అయితే, రామస్వామి లోకల్‌గా ఉండకపోవడంతో.. అతని భూమిని కబ్జా చేశాడు స్థానిక వీఆర్వో సోదరుడు. అతని పేరెంట్స్‌ను కూడా బెదిరిస్తున్నాడు.
సెల్ఫీ వీడియో వైరల్..
కబ్జా విషయం తెలిసిన వీర జవాన్.. తనకు న్యాయం చేయాలంటూ, తన భూమి తనకు ఇప్పించాలంటూ ఎమ్మార్వో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయం చెబుతూ.. బోర్డర్‌లో డ్యూటీ చేస్తూనే ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. సీఎం రేవంత్‌రెడ్డినే తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆర్మీ యూనిఫాంలో ఉన్న రామస్వామి తన భూమి కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేయటాన్ని చూసి అంతా చలించిపోతున్నారు. జవాన్‌కు ఎంత కష్టం వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హరీశ్‌రావు రియాక్షన్..
జవాన్ సెల్ఫీ వీడియో చూసిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. దేశాన్ని కాపాడే జవాన్‌కు అండగా ఉంటానన్నారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. జవాన్ సమస్యను పరిష్కరించి, తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు హరీశ్‌రావు.
Requested @Collector_SDPT Garu to investigate the matter and take necessary action. It's appalling that a soldier safeguarding our borders faced such an incident. https://t.co/3krAztih5D
— Harish Rao Thanneeru (@BRSHarish) May 17, 2025