BigTV English

Ahmedabad: విమానం కూలిన ప్రాంతంలో 70 తులాల బంగారం, క్యాష్.. అదంతా ఏమైందంటే?

Ahmedabad: విమానం కూలిన ప్రాంతంలో 70 తులాల బంగారం, క్యాష్.. అదంతా ఏమైందంటే?

Ahmedabad: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ఘటనలో మృతదేహాలను వారి వారి బంధువులకు అప్పగిస్తున్నారు. సరిగా ఆనవాళ్లు లేని కుటుంబాల నుంచి డీఎన్ఏ టెస్టు చేసిన తర్వాత వారికి మృతదేహాలను అప్పగిస్తున్నారు పోలీసులు.  ఈ ప్రాసెస్ వేగంగా జరుగుతోంది. కాకపోతే డీఎన్‌ఏ రిపోర్టు రావడానికి 70 గంటలు పైనే పడుతుందని అంటున్నారు. ఘటన ప్రాంతంలో దొరికిన బంగారం, క్యాష్ మాటేంటి? ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అనేది అసలు ప్రశ్న.


ఊరికి వెళ్తున్నామంటే.. బంగారం పెట్టుకుని మహిళలు బయలుదేరుతారు. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో చాలామంది బంగారం ధరించారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అవుతూ కూతవేటు దూరంగా బీజె మెడికల్ కాలేజీలో ఆవరణంలో కూలిపోయింది. 242 మందిలో ఒకరు మాత్రమే బయటపడ్డారు.

అయితే ఘటన జరిగిన ప్రాంతం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్‌కుమార్‌ రమేశ్‌. అతడు ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ వచ్చిన వీడియో బయటకు‌ వచ్చింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లే సాహసం చేయలేకపోయారు.


ఘటన నుంచి తెలియగానే 56 ఏళ్ల వ్యాపారవేత్త రాజు‌ పటేల్ ఏ మాత్రం వెనక్కితగ్గేలేదు. సహచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు ఆయన. ప్రమాదం జరిగిన ఐదు నిమిషాల్లో ఆ ప్రాంతానికి వెళ్లాడు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడంలో ఆయన సాయం అంతా ఇంతా కాదు.

ALSO READ: మరో ప్రమాదం.. ఎయిరిండియా విమానాలకు ఏమైంది?

బాధితులను వెతికే క్రమంలో ఆయన‌తో వచ్చిన సహచరులకు 70 తులాల బంగారు ఆభరణాలు, 80 వేల నగదు, పాస్‌పోర్టు, భగవద్గీత పుస్తకం దొరికాయి. లభించిన మొత్తం సొత్తును దర్యాప్తు అధికారులకు అప్పగించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన పటేల్, తొలి అర గంట వరకు తాము ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లలేకపోయామని తెలిపాడు.

అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత సహాయం చేయడం కోసం ముందుకు వెళ్లామని తెలిపాడు. స్ట్రెచర్లు కనిపించకపోవడంతో గాయపడిన వారిని అంబులెన్స్‌ వరకు తీసుకెళ్లడానికి చీరలు, బెడ్‌షీట్‌లను ఉపయోగించి బాధితులను తీసుకెళ్లినట్టు వెల్లడించాడు. సాయంత్రం 4 గంటల తర్వాత పటేల్ టీమ్ కీలకమైన పనిలోకి దిగింది.

ఆ ప్రదేశమంతా చెల్లా చెదురుగా పడి కాలిపోయిన సంచులను  పరిశీలించింది. బంగారం గాజులు, ఇతర ఆభరణాలతో 70 తులాల బంగారు ఆభరణాలను కనుగొన్నట్లు తెలిపాడు. సంచుల నుండి 80 వేల నగదు, భగవద్గీత పుస్తకం, పాస్‌పోర్ట్‌లను బయటకు తీశామన్నారు. వాటిని సేకరించి అధికారులకు అప్పగించినట్టు ఆయన మీడియాకు తెలిపాడు.

సాయంత్రం 9 గంటల వరకు ఆ ప్రాంతంలో సహాయం చేయడానికి అధికారులు అనుమతి ఇచ్చారని గుర్తు చేశాడు. అయితే దొరికిన నగలు, నగదు, మిగతా వస్తువులపై హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి నోరు విప్పారు. బాధితులకు చెందిన వస్తువులను సేకరించి వాటిని డాక్యుమెంట్ చేసిన తర్వాత ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు తిరిగి ఇస్తామని అన్నారు. వీణాబెన్ అఘేదా మృత దేహం నుండి స్వాధీనం చేసుకున్న నాలుగున్నర లక్షల విలువైన నాలుగైదు తులాల బంగారు ఆభరణాలను ఆమె కుటుంబానికి పోలీసులు అందజేశారు.

 

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×