BigTV English

Telangana : కేటీఆర్‌కు మరింత ఉచ్చు! ఐఏఎస్ అర్వింద్‌కు చెక్!

Telangana : కేటీఆర్‌కు మరింత ఉచ్చు! ఐఏఎస్ అర్వింద్‌కు చెక్!

Telangana : ఫార్ములా-ఈ రేస్ కేసు. కేటీఆర్‌ను ఇప్పటికే ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది. సెల్‌ఫోన్స్ సీజ్ చేయాలని చూసింది. కానీ, ముందే జాగ్రత్త పడిన కేటీఆర్.. విచారణకు మొబైల్ ఫోన్లు తీసుకురాలేదు. ఆనాడు వాడిన ఫోన్లు ఇవ్వాల్సిందేనంటూ ఏసీబీ అల్టిమేటం జారీ చేసింది. ఫోన్లు అయితే ఇస్తారేమో కాని అందులో డేటా డిలీట్ చేసి ఉంటారుగా? అనే డౌట్ కూడా ఉంది. గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులోనూ కవిత అలానే చేశారు. దర్యాప్తు సంస్థలకు అందజేసిన తన మొబైల్ ‌ఫోన్లలోని డేటా అంతా డిలీట్ చేశారని అన్నారు. కానీ, ఆ డేటాను రీట్రీవ్ చేశారు అధికారులు. కేసులో అవే కీలక సాక్ష్యాలుగా మారాయి. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే జరగబోతోందా? ఆయన సెల్ ‌ఫోన్స్‌లో కీలక సమాచారం దాగుందా? ఆ ఫోన్లు ఏసీబీ చేతికి చిక్కితే.. కారు రేసు ఖేల్ ఖతమేనా?


సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్.. అవే కీలకమా?

ఏసీబీ విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. FEO కంపెనీతో ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ మెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. రూ.55 కోట్ల నగదు HMDA ఖజానా నుంచి FEO కంపెనీకి బదిలీ చేశారు. తాను చెప్తేనే అధికారులు ఆ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారని ఏసీబీ ముందు కేటీఆర్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అందుకే, సెల్‌ఫోన్స్‌తో పాటు ఆయన వాడిన ల్యాప్‌ట్యాప్స్ కూడా విచారణలో కీలకం కానున్నాయి. ఈసారి ఎంక్వైరీకి వచ్చేటప్పుడు ఆ సమయంలో వాడిన ల్యాప్‌ టాప్స్‌ తీసుకురావాలని ఏసీబీ అధికారులు సూచించారు. ల్యాప్‌టాప్‌లో సమాచారం ఆల్రెడీ డిలీట్‌ చేసి ఉంటే.. తిరిగి రీ ట్రీవ్ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది.


ఐఏఎస్ అర్వింద్ ఎక్కడ?

ఇక, ఈ కేసులో ఆనాటి మంత్రి కేటీఆర్ ఎంత ముఖ్యమో.. సీనియర్ IAS అర్వింద్ కుమార్ సైతం అంతే ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆయన దేశంలో లేరు. నెల రోజుల లీవ్‌పై ఫారిన్ టూర్ వెళ్లారు. అదేంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కీలక దశకు చేరిన ఈ సమయంలో అర్వింద్ కుమార్‌కు లీవ్ ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరికి చెప్పి ఇచ్చారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అర్వింద్‌ను కేటీఆరే విదేశాలకు పారిపొమ్మని పంపించారంటూ కాంగ్రెస్ లీడర్లు పొలిటికల్ స్టేట్‌మెంట్స్ కూడా ఇస్తున్నారు.

Also Read : కేసీఆర్‌ను ఏపీ సర్కారు అరెస్ట్ చేస్తుందా?

సీఎంకు తెలీకుండానే లీవ్..

ఐఏఎస్ అర్వింద్ కుమార్‌కు ఏప్రిల్ 15న అప్పటి CS శాంతికుమారి నెలరోజులు లీవ్ మంజూరు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురాకుండానే లీవ్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. రెండ్రోజులుగా అర్వింద్ కోసం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

లీవ్ క్యాన్సిల్.. డెడ్‌లైన్..

ఫార్ములా ఈ కార్ రేసులో A2గా IAS అర్వింద్ కుమార్ ఉన్నారు. ఆయన లీవ్‌‌పై వివాదం ముదురుతోంది. అర్వింద్‌కు ఇచ్చిన సెలవులను అర్థాంతరంగా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే తిరిగి రావాలని ఆదేశించారు. ప్రస్తుతం యూరప్ ట్రిప్‌‌లో ఉన్న అర్వింద్‌.. జూన్ 21న హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. KTR విచారణ తర్వాత మరోసారి అర్వింద్‌‌‌ను ఎంక్వైరీ చేయాలని ఏసీబీ భావిస్తోంది.

 

Related News

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Big Stories

×