Air India Flight: మరో ఎయిరిండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన పైలెట్ ప్రయాణికులను కోల్‌కతాలో దింపేశారు. విమానం ఇంజన్లలో ఒకదాంట్లో టెక్నికల్ ఇష్యూ రావడంతో పైలెట్.. భద్రత దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఎయిర్ ఇండియాకు ఏమయ్యింది?నిన్న హాంకాంగ్, ఇవ్వాల కోల్‌కతా ఎమర్జెన్సీ ల్యాండింగ్. అసలు ఎయిరిండియా విమానాలు సేఫేనా? టాటా బ్రాండింగ్ కే బ్యాండు పడేలా.. ఏంటీ నష్టాల పరంపర? సంస్థ ముందు అతి పెద్ద టాస్క్. ఈ మధ్యే లాభాలు వచ్చాయి. కంపెనీ గాడిలో పడుతోందనుకుంటే.. ఇపుడేంటీ దుస్థితి? ఎయిర్ ఇండియా విమానాల్లో ఎన్ని సేఫ్? ప్రయాణికులకు ఏంటీ.. ఎయిర్ టెన్షన్?
ఒక విమానయాన సంస్థ వరుస ఘటనలు జరగటం బహుశా ఇదేనేమో. దీంతో ఆ సంస్థ క్రెడిబిలిటీ క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికే 270 మందికి పైగా మరణించిన ఘటన తాలూకూ మరక.. కడుక్కోడానికి కంపెనీ విపరీతంగా ట్రై చేస్తోంది. ఇప్పటికే మృతులకు కోటి ఆర్ధిక సాయం ప్రకటించిన ఎయిర్ ఇండియా.. మరో పాతిక లక్షల మేర అదనపు సాయం కూడా ప్రకటించింది. దీన్ని మధ్యంతర తక్షణ సాయం కింద ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. X వేదికగా ఒక పోస్టు ద్వారా ఎయిర్ ఇండియా ఈ విషయం ప్రకటించింది
ఇలా ఎందుకు చేయాల్సి వస్తోందంటే.. మార్కెట్ వాల్యూ ఎక్కడ పడిపోతుందో అన్న భయం. ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్ ఇండియాకి దారుణమైన గడ్డు కాలం నడుస్తోంది. అహ్మదాబాద్ దుర్ఘటన జరిగిన రోజున విమానయాన రంగ సంస్థల షేర్లు పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మదుపరులు భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు పాల్పడ్డారు.
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ అయిన ఇండిగో షేర్ల విలువ ఆరీగా దెబ్బ తినింది. ఆ ఒక్క రోజే 187 రూపాయల మేర పతనమైంది. విమాన ప్రయాణ రక్షణపై ఏర్పడ్డ భయాలు.. ఎయిర్ లైన్ స్టాక్స్ ని ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెషర్లోకి నెట్టాయని విశ్లేషించారు మార్కెట్ నిపుణులు.
విమానయాన అనుబంధ రంగాల షేర్లు కూడా నష్టాలకు గురయ్యాయి. యునిమెక్ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, తనేజా ఏరోస్పేస్, టాల్ ఎంటర్‌ప్రైజెస్, ఎం టార్ టెక్నాలజీస్, ఆజాద్ ఇంజినీరింగ్.. తదితర కంపెనీల షేర్ల విలువ ఒకటిన్నర నుంచి నాలుగున్నర శాతం వరకూ పడిపోయాయి.
Also Read: విమాన ప్రమాదంలో నర్సు మృతి.. రెవిన్యూ ఆఫీసర్ అనుచిత పోస్ట్.. చివరకు?
ఇక ప్రమాదానికి గురైన బోయింగ్ సంస్థ షేర్లు కూడా పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఘటన జరిగిన రోజున 8 శాతం వరకూ పడిపోయిందీ కంపెనీ షేర్. బోయింగ్ విమానాల అమ్మకాలు సైతం ప్రభావితం కావచ్చని అంటారు. ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్లు సైతం తగ్గవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి. సెన్సెక్స్ 823 పాయింట్లు డౌన్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లో ఈ ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత కంపెనీల షేర్ల విలువ సుమారు 6 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరయ్యింది.
ఎయిర్ ఇండియా సంగతి సరే సరి. ఈ యాక్సిడెంట్ ద్వారా ఒక బోయింగ్ విమానం పూర్తిగా కోల్పోయింది. దీని ధరే 120 మిలియన్ డాలర్లు. ఇది ఇండియన్ కరెన్సీలో చెబితే సుమారు వెయ్యి కోట్లు. దీంతో పాటు 270 మందికి పైగా కోటి పాతిక లక్షల నష్ట పరిహారం.. ఈ మొత్తం మరో మూడు వందల కోట్లు. వీటికన్నా మించినది.. కంపెనీ మార్కెట్ వాల్యూ విపరీతంగా పడిపోవడం. ఇది అన్నిటికన్నా మించిన అతి పెద్ద దెబ్బ.
VIDEO | Kolkata: An Air India flight from San Francisco to Mumbai via Kolkata suffered a technical snag in one of its engines, requiring passengers to be deplaned during a scheduled halt at the city airport early on Tuesday.
Flight AI180 arrived on time at the city airport at… pic.twitter.com/0MSUiiwPdZ
— Press Trust of India (@PTI_News) June 17, 2025