BigTV English

Shreyas Iyer: ఏం దరిద్రం రా…వారం తిరగకముందే మరో ఫైనల్ ఓడిన శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer: ఏం దరిద్రం రా…వారం తిరగకముందే మరో ఫైనల్ ఓడిన శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer:  టీమిండియా ఫ్యూచర్ స్టార్ శ్రేయాస్ అయ్యర్ టైం అస్సలు బాగోలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోవడంతో… టైటిల్ అందుకోకుండా.. తీవ్ర నిరాశకులోనయ్యాడు శ్రేయస్ అయ్యర్. అయితే ఈ సంఘటన జరిగి వారం రోజులు తిరగకముందే మరో ఫైనల్ కూడా ఓడిపోయాడు శ్రేయస్ అయ్యర్. ముంబై t20 లీగ్ 2025 టోర్నమెంట్ లో కూడా కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ కు… ఇక్కడ కూడా నిరాశ ఎదురయింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ టీం ఓడిపోవడంతో.. మళ్లీ రన్నరప్ గా.. నిలిచింది.


Also Read: Mayank Yadav – Sanjeev: గాయం పేరుతో నాటకాలు.. మహిళా క్రికెటర్ తో సహజీవనం.. మయాంక్ పై సంజీవ్ సీరియస్ ?

బెంగళూరు చేతిలో ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన పంజాబ్


సరిగ్గా తొమ్మిది రోజుల కిందట అంటే గత మంగళవారం రోజున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అప్పటివరకు బాగా ఆడిన శ్రేయస్ అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్… ఫైనల్ మ్యాచ్లో మాత్రం అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఆరు పరుగుల తేడాతో… రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్గా బెంగళూరు నిల్వగా… రన్నరప్ జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. దీంతో కచ్చితంగా టైటిల్ గెలవాలన్న శ్రేయస్ అయ్యర్… కోరిక నెరవేర లేకపోయింది.

రెండోసారి ఫైనల్ ఓడిన శ్రేయస్ అయ్యార్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే… ముంబై టి20 లీగ్ 2025 టోర్నమెంట్ కు శ్రేయస్ అయ్యర్ వచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే శోబో ముంబై ఫాల్కన్స్ జట్టును లీడ్ చేస్తూ ఫైనల్ దాకా తీసుకువచ్చాడు శ్రేయస్ అయ్యర్. అయితే గురువారం రోజున అంటే నిన్న… ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ వర్సెస్ ముంబై ఫాల్కన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ టీం ముంబై ఫాల్కన్స్… ఐదు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ టీం… నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. మయూరేష్ తండాల్ 50 పరుగులు చేయగా హర్ష అగావ్ 45 పరుగులతో రాణించారు. మిగతా ప్లేయర్లు విఫలం కావడంతో తక్కువ స్కోరు చేసింది ముంబై ఫాల్కన్స్.
అయితే 158 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఫినిష్ చేసింది ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్. చిన్మయి రాజేష్ 53 పరుగులు, ఆవైస్కాన్ 38 పరుగులతో దుమ్ము లేపి మ్యాచ్ను గెలిపించారు. ఈ దెబ్బకు తొమ్మిది రోజుల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్ రెండు ఫైనల్ మ్యాచ్లు ఓడిపోవలసి వచ్చింది.

Also Read:  RCB For Sale: అమ్మేయడం ఫైనల్… ఆ లేడీ చేతికి RCB టీం.. ట్రబుల్ షూటర్ ప్లాన్ అదుర్స్ !

 

Shreyas Iyer

3 June – Lost IPL 2025 Final
12 June – Lost T20 Mumbai League final*

 

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×