BigTV English
Advertisement

Amit Shah Tamil Nadu : అవినీతిని కప్పిపుచ్చడానికే హిందీ వివాదం.. స్టాలిన్ ప్రభుత్వంపై అమిత్ షా సీరియస్

Amit Shah Tamil Nadu : అవినీతిని కప్పిపుచ్చడానికే హిందీ వివాదం.. స్టాలిన్ ప్రభుత్వంపై అమిత్ షా సీరియస్

Amit Shah Tamil Nadu | తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలోకి అనువదించే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఇలాంటి అవసరమైన విషయాల్లో చర్యలు తీసుకునే ధైర్యం లేదని ఆయన స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నూతన విద్యా విధానం 2020ను అమలు చేయడంపై కొన్నాళ్లుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది.


ఎన్ఈపీ పేరుతో హిందీ భాషను కేంద్రం బలవంతంగా రుద్దుతోందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో భాష చుట్టూ నెలకొన్న వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలోకి అనువదించే ధైర్యం డీఎంకే పార్టీకి లేదని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోర్సులను తమిళంలోకి అనువదించేలా చూస్తామని ఆయన తెలిపారు.

Also Read: కర్ణాటకలో హనీ ట్రాప్ దుమారం.. అసెంబ్లీ నుంచి 18 మంది బిజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్


ప్రజల దృష్టిని మళ్లించడానికే డీఎంకే పార్టీ భాషా వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని అమిత్ షా ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను దాచాలనే ఉద్దేశంతో భాషా వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆయన అన్నారు. హిందీ ఏ జాతీయ భాషతోనూ పోటీ పడదని, ఈ భాష కేవలం సామరస్యాన్ని పెంపొందిస్తుందని అమిత్ షా పునరుద్ఘటించారు. అన్ని భారతీయ భాషలకు హిందీ తోడుగా ఉంటుందని షా అన్నారు. దేశంలో హిందీ ఆధిపత్య పాత్ర కంటే సహాయక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని బలోపేతం చేయడంలో, ప్రాంతీయ భాషల మధ్య పరస్పర సంబంధాన్ని పెంపొందించడంలో హిందీ సహాయపడుతుందని అమిత్ షా అన్నారు.

భాష పేరుతో దేశాన్ని విభజించే వారి అజెండా నెరవేరకుండా ఉండాలని తాను దేశ ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా తెలిపారు. అధికార భాషా శాఖ కింద ఎన్డీయే ప్రభుత్వం భారతీయ భాషల విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, బెంగాళీ వంటి భాషల వినియోగాన్ని పెంపొందించడానికి ఈ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.

ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రాంతీయ భాషల్లో అధికారికి ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రారంభిస్తామని అమిత్ షా వెల్లడించారు. డిసెంబర్ తర్వాత పౌరులతో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు తమ సొంత భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించవచ్చని ఆయన తెలిపారు. అవినీతిని దాచడానికి భాష పేరుతో తమ సొంత అజెండాను నడిపేవారికి ఇది తమ నుంచి వస్తున్న బలమైన సమాధానమని అమిత్ షా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల భాషలను బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని వచ్చిన ఆరోపణలను కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు.

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×